డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో.. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం..

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. అదృష్టం కొద్దీ ప్రయాణికులు బయటపడ్డారు గానీ లేకపోయింటే డ్రైవర్ నిర్లక్ష్య వైఖరితో భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది.

  • Share this:
    హైదరాబాద్‌లో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. అదృష్టం కొద్దీ ప్రయాణికులు బయటపడ్డారు గానీ లేకపోయింటే డ్రైవర్ నిర్లక్ష్య వైఖరితో భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. వివరాల్లోకెళితే.. నగరంలోని అంబర్‌పేట్‌లో వరంగల్-2 డిపోకు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింటింది. బస్సు ఉదయం 7.30 గంటల సమయంలో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి వరంగల్‌కు బయలు దేరింది. తురాబ్ నగర్ ఇరానీ హోటల్ వద్దకు వెళ్లగానే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అదుపు తప్పి ముందున్న కారు, ఆటోను ఢీ కొట్టింది. ఆ తర్వాత వెంటవెంటనే విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు, కారు, ఆటోల్లో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఆ సమయంలో విద్యుత్తు స్తంభం వైర్ల నుంచి విద్యుత్తు ప్రసారం అయ్యుంటే ఘోరం జరిగిపోయేది.

    కాగా, బస్సు డ్రైవర్ సెల్‌ ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంబర్‌పేట్‌ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: