స్టీరింగ్ వదిలి గుట్కా వేసుకున్న డ్రైవర్... జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా...

టీవీనగర్ సమీపంలో మానేరు వంతెన దాటుతున్న సమయంలో అదుపుతప్పి, పక్కనున్న 9 మీటర్ల లోతైన గొయ్యిలోకి బస్సు... ప్రమాద సమయంలో 63 మంది ప్రయాణికులు... ఐదుగురు పరిస్తితి విషమం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 15, 2019, 4:08 PM IST
స్టీరింగ్ వదిలి గుట్కా వేసుకున్న డ్రైవర్... జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో  ఆర్టీసీ బస్సు బోల్తా...
ప్రమాదస్థలంలో బోల్తా పడిన బస్సు...
  • Share this:
తెలంగాణ జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కర్నూలులోని వెల్దుర్తి దగ్గర జరిగిన బస్సు ప్రమాదం మరువకముందే జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడడం ప్రయాణికులను కలవరబెడుతోంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన AP 01Y 2992 నెంబరు గల ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి బయలుదేరింది. టీవీనగర్ సమీపంలో బస్సు మానేరు వంతెన దాటుతున్న సమయంలో అదుపుతప్పి, పక్కనున్న 9 మీటర్ల లోతైన గొయ్యిలోకి పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 63 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 35 మంది తీవ్రగాయాలయ్యాయి. బస్సు వంతెన దాటుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన డ్రైవర్... గుట్కా వేసుకోవడమే ప్రమాదానికి కారణమని ప్రత్యేక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకున క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు. గుట్కా నములుతూ నిర్లక్ష్యంగా వ్యవహారించి ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు... అతని కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బస్సు ప్రమాదానికి గురికాగానే ప్రయాణికులు కొట్టి, చంపేస్తారనే భయంతోనే అతను అక్కడి నుంచి పరారై ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు.
First published: May 15, 2019, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading