హోమ్ /వార్తలు /క్రైమ్ /

RSS Worker : ముస్లిం వ్యక్తి హత్య జరిగిన 24 గంటల్లోనే..RSS కార్యకర్తను నరికి చంపేశారు!

RSS Worker : ముస్లిం వ్యక్తి హత్య జరిగిన 24 గంటల్లోనే..RSS కార్యకర్తను నరికి చంపేశారు!

 ఆర్ఎస్ఎస్ నేత దారుణ హత్య

ఆర్ఎస్ఎస్ నేత దారుణ హత్య

RSS Leader Murder : కేరళలో ఆర్​ఎస్​ఎస్​ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. పాలక్కాడ్ సమీపంలోని ఎలప్పుల్లిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)కార్యకర్త సుబైర్(43)అనే ముస్లిం దారుణ హత్యకు గురైన 24 గంటల వ్యవధిలోనే..

RSS Leader Murder : కేరళలో ఆర్​ఎస్​ఎస్​ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. పాలక్కాడ్ సమీపంలోని ఎలప్పుల్లిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)కార్యకర్త సుబైర్(43)అనే ముస్లిం దారుణ హత్యకు గురైన 24 గంటల వ్యవధిలోనే..శనివారం మధ్యాహ్నాం పాలక్కాడ్ పట్టణంలోని మేలమూరి వద్ద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఐదుగురు దుండగులు రెండు బైక్​ ల​పై వచ్చి ఆర్ఎస్ఎస్ నేతని నరికి చంపారు. మృతుడ్ని ఆర్ఎస్​ఎస్​ మాజీ షరీక్ శిక్షణ్ ప్రముఖ్​ శ్రీనివాసన్ ​గా(45) పోలీసులు గుర్తించారు. శ్రీనివాసన్ ఒక్కడే దుకాణంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగిందని.. బాధితుడిని వెంటనే ప్రైవేట్‌ హాస్పిటల్ కి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.

కాగా, శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు అనంతరం SDPI కార్యకర్త సుబైర్.. తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా రెండు కార్లలో వచ్చిన దుండగులు సుబైర్‌ బైక్‌ను ఢీకొట్టారు. వెంటనే తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో సుబైర్ ని దారుణంగా నరికి చంపారు. ఇక, బైక్‌పై నుంచి కిందపడటంతో సుబైర్ తండ్రి అబూబకర్‌ కు గాయాలయ్యాయి. ఈ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఎస్‌డిపిఐ ఆరోపించింది. ఈ క్రమంలో సుబైర్ మృతదేహానికి అంత్యక్రియలు కూడా జరగకముందే ఆర్‌ఎస్‌ఎస్ నేత హత్య జరగడంతో అధికారులు, ప్రజలు షాక్‌ కు గురయ్యారు. సుబైర్ హత్యకు ప్రతీకారంగానే శ్రీనివాసన్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. శ్రీనివాసన్ హత్య వెనుక పాపులర్​ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తాలుకా రాజకీయ శాఖ అయిన సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఎస్​డీపీఐ) ఉందని బీజేపీ ఆరోపించింది. ఇక,పాలక్కాడ్ అంతటా నిఘాను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ UP : పారిపోయిన హిందూ, ముస్లిం ప్రేమికుల జంట..ముస్లిం యువకుడి ఇంటికి నిప్పు

మరోవైపు, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను భారతీయ జనతా పార్టీ ( BJP)లో విలీనం చేసి రాజకీయ పార్టీగా మార్చాలని రాజస్తాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ స‌లహా ఇచ్చారు. బీజేపీని గెలిపించడానికి ఆర్ఎస్ఎస్ వెనుక ఉండి పని చేస్తుందని అన్నారు. ఇకనుండైనా ఆర్ఎస్ఎస్ ముందుకు రావాలనీ, బీజేపీలో విలీనం చేసి రాజకీయ పార్టీగా మారాలని అని అన్నారు. 15 ఏళ్లలో అఖండ భారత్‌ చేస్తామన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య‌లపై గెహ్లాట్ స్పందిస్తూ.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను "అఖండ భారత్" అంటే ఏమిటో స్పష్టం చేయాలని కోరారు మరియు భారతదేశం ఇప్పటికే "ఐక్యత" కాలేదా అని ప్రశ్నించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Burtally murder, Kerala, RSS

ఉత్తమ కథలు