హోమ్ /వార్తలు /క్రైమ్ /

Exam Cheating: పోటీ పరీక్షలో కాపీ కొట్టేందుకు బ్లూటూత్‌ స్లిప్పర్ల తయారీ.. వాటి విలువ రూ.6 లక్షలు..

Exam Cheating: పోటీ పరీక్షలో కాపీ కొట్టేందుకు బ్లూటూత్‌ స్లిప్పర్ల తయారీ.. వాటి విలువ రూ.6 లక్షలు..

చెప్పులో బ్లూటూత్

చెప్పులో బ్లూటూత్

Exam Cheating: ఉపాధ్యాయ ప్రవేశపరీక్షకు అభ్యర్థులను తీర్చిదిద్దాల్సిన ఓ కోచింగ్‌ సెంటర్‌ యజమాని అడ్డదారులు తొక్కాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఒక అభ్యర్థికి సాయం చేసేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏకంగా చెప్పుల్లో బ్లూటూత్ డివైజ్‌ పెట్టిమరీ ఒకరిని పరీక్ష హాల్‌లోకి పంపించాడు. అయితే అక్కడ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి ...

ఉపాధ్యాయ ప్రవేశపరీక్షకు అభ్యర్థులను తీర్చిదిద్దాల్సిన ఓ కోచింగ్‌ సెంటర్‌ యజమాని అడ్డదారులు తొక్కాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఒక అభ్యర్థికి సాయం చేసేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏకంగా చెప్పుల్లో బ్లూటూత్ డివైజ్‌ పెట్టిమరీ ఒకరిని పరీక్ష హాల్‌లోకి పంపించాడు. అయితే అక్కడ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధ్యాయుల నియామకం కోసం రాజస్థాన్‌ ప్రభుత్వం రాజస్థాన్‌ ఎలిజిబిలిటీ ఎగ్జామ్‌ ఫర్‌ టీచర్‌ (REET Exam) పరీక్ష నిర్వహించింది. మూడేళ్ల విరామం తర్వాత కొత్త నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఈ పరీక్షల్లో ఉద్యోగాలు పొందేందుకు చాలామంది అడ్డదారులు తొక్కారు. ఒక కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుడు చేసిన కొత్త తరహా మోసాన్ని అధికారులు గుర్తించారు.

ఐటీ ఉద్యోగాల కోసం చూసేవారికి గుడ్‌న్యూస్.. ట్రైనింగ్ ఇచ్చిమరీ ఉద్యోగాల్లోకి తీసుకోనున్న HCL సంస్థ.. పూర్తి వివరాలు ఇవే..


పరీక్షల్లో సమాధానం చెప్పేందుకు వీలుగా ఒక అభ్యర్థి చెప్పుల్లో బ్లూటూత్‌ పరికరాన్ని ఫిక్స్ చేశారు. స్లిప్పర్ల అడుగుభాగంలో ఒక చిన్న బ్యాటరీ, సిమ్‌ కార్డు అమర్చి, పరీక్ష రాసేవారి చెవిలో ఎవరికి కనిపించకుండా చాలా లోపలికి బ్లూటూత్‌తో పనిచేసే ఒక మైక్రో ఇయర్‌ పీస్‌ ఫిక్స్‌ చేశారు. దీని ద్వారా అభ్యర్థులు జవాబులు వినగలుగుతారు అని పోలీసులు తెలిపారు.

ఈ ముఠాకు చెందిన నలుగురిని బికనేర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ చెప్పులను విద్యార్థులకు రూ.6 లక్షల చొప్పున అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సూత్రధారి సస్పెండైన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ తుల్సిరామ్‌ కాలేర్‌ అని పోలీసులు గుర్తించారు. ఆయనను వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ తరహా కేసుల్లో ఆయన గతంలోనూ ఒకసారి అరెస్టు అయినట్టు తెలుస్తోంది.

IIIT Hyderabad: ట్రిపుల్​ఐటీ హైదరాబాద్​లో కొత్త కోర్సు.. ఆ ప్రోగ్రాంకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలివే..


ఈ పరీక్ష జరుగుతున్నంత సేపు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. రాజస్థాన్‌ వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిన 40 మందిని అరెస్టు చేశారు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాస్తూ కొందరు పట్టుబడ్డారు. సవాయ్‌ మాధోపూర్‌ జిల్లాలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు పరీక్ష రాస్తున్న తమ భార్యలకు చీటిలు అందిస్తూ అడ్డంగా దొరికిపోయారు.

దీంతో వారిని సస్పెండ్ చేసి, భార్యలను అదుపులోకి తీసుకున్నారు. మరో చోట అభ్యర్థుల తరఫున పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పోలీసులకు చిక్కారు. ఈ పరీక్షలో భారీ మోసాలు జరుగుతాయనే అనుమానంతో రాజస్థాన్‌లో చాలా చోట్ల ఇంటర్నెట్‌, ఎంఎస్‌ఎం సేవలు నిలుపు చేశారు.

First published:

Tags: Exams, Jaipur, Rajastan

ఉత్తమ కథలు