ఒక్కసారి రూ.30 వేలు చెల్లిస్తే చాలు.. నెలనెలా రూ.10వేలు.. ఘరానా మోసం..

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బీర్షాబా అనే సంస్థ ఏడాది కాలంగా ప్రత్యేక స్కీమ్ పేరుతో పలు గ్రామాల్లో కిరాణ దుకాణాలను ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రత్యేక స్కీము పెట్టి ఒక్కసారి రూ.30వేలు చెల్లిస్తే.. పది నెలల పాటు రూ.10వేలు చె్లిస్తామని చెప్పింది.

news18-telugu
Updated: July 9, 2020, 7:17 AM IST
ఒక్కసారి రూ.30 వేలు చెల్లిస్తే చాలు.. నెలనెలా రూ.10వేలు.. ఘరానా మోసం..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రస్తుత రోజుల్లో కష్టపడితేనే సొమ్ము రావడం కష్టంగా మారింది. అలాంటిది ఫ్రీగా డబ్బులు ఇస్తామంటూ నమ్మించి రూ.కోట్లు గడిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజుకోకటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కసారి రూ.30వేలు చెల్లిస్తే.. చాలు పది నెలల పాటు నెలనెలా రూ.10వేలు ఇస్తామంటూ నమ్మబలికారు. అది నమ్మిన ప్రజలు రూ.30వేలు చెల్లించారు. తీరా ఆ బోర్డు తిప్పేయడంలో లబోదిబోమన్నారు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బీర్షాబా అనే సంస్థ ఏడాది కాలంగా ప్రత్యేక స్కీమ్ పేరుతో పలు గ్రామాల్లో కిరాణ దుకాణాలను ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రత్యేక స్కీము పెట్టి ఒక్కసారి రూ.30వేలు చెల్లిస్తే.. పది నెలల పాటు రూ.10వేలు చె్లిస్తామని చెప్పింది. అది నమ్మి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట,కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో పెద్దఎత్తున మహిళలు, యువకులు ఆ స్కీములో రూ.30వేలు చెల్లించి జాయిన్ అయ్యారు.

చైన్ లింకు కావడంతో ఒకరిని చూసి మరొకరు అప్పులు చేసి బీర్షాబా సంస్థలో చేరారు. డబ్బులు చెల్లించి స్కీములో చేరిన వారికి ఖాతా పుస్తకాలను సైతం ఇచ్చారు. చైన్ లింకు కావడం.. ఒక్కరిని చేరిస్తే.. రూ.5వేలు కమీషన్ ఇవ్వడంతో ఏజెంట్లు పెద్దఎత్తున స్కీములో చేర్పించారు. తీరా ఆ సంస్థ బోర్డును తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 2వేల మందికి పైగా బీర్షాబా సంస్థలో రూ.30 వేల చొప్పున డబ్బులు కట్టి స్కీములో చేరారు. ఈ లెక్కన ఒక్క సిరిసిల్ల జిల్లాలో రూ.6కోట్ల మేర మోసం జరిగింది. పోలీసులు కామారెడ్డిలోని సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. సంస్థ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 7:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading