సికింద్రాబాద్‌లో భారీ చోరీ.. పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

రూపారామ్ డబ్బు సంచితో నవకార్ జ్యువెలరీ షాపు సెల్లార్ వద్దకు చేరుకోగానే.. అక్కడే ఉన్న కొంతమంది దుండగులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి డబ్బుతో ఉడాయించారు.

news18-telugu
Updated: November 13, 2019, 7:14 AM IST
సికింద్రాబాద్‌లో భారీ చోరీ.. పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని జనరల్ బజార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుండగులు పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. జనరల్ బజార్ ప్రాంతంలో రోహిత్,నవకార్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. రోహిత్ దుకాణంలో నగలు తయారుచేస్తుంటారు. వాటిని నవకార్ జ్యువెలరీ షాపు కొనుగోలు చేస్తుంటుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గత లావాదేవీలకు సంబంధించి నవకార్ జ్యువెలరీ వారికి ఇవ్వాల్సిన డబ్బును రోహిత్ జ్యువెలరీ షాపు యాజమాన్యం రూపారామ్ అనే వ్యక్తికి ఇచ్చి పంపించింది. రూపారామ్ ఆ డబ్బు సంచితో నవకార్ జ్యువెలరీ షాపు సెల్లార్ వద్దకు చేరుకోగానే.. అక్కడే ఉన్న కొంతమంది దుండగులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి డబ్బుతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా కేసులో పురోగతి సాధిస్తామని చెబుతున్నారు.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు