False Rape Case: తప్పుడు రేప్ కేసు పెట్టిన యువతి... షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు

False Rape Case: రేప్ జరిగితే రేపిస్టుకి ఉరి వెయ్యాలనే డిమాండ్లు రావడం సహజం. మరి రేప్ జరగకుండా జరిగినట్లుగా కేసు పెడితే... అలాంటి కేసేంటో, దానిపై కోర్టు ఏ తీర్పు ఇచ్చిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 22, 2020, 12:19 PM IST
False Rape Case: తప్పుడు రేప్ కేసు పెట్టిన యువతి... షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు
తప్పుడు రేప్ కేసు పెట్టిన యువతి... షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు
  • Share this:
False Rape Case in Chennai : తమిళనాడుకు చెందిన యువకుడు సంతోష్ కుటుంబం, ఓ అమ్మాయి (రేప్ జరిగిందని ఆరోపించిన యువతి) కుటుంబాల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. సంతోష్‌కి ఆమెను ఇచ్చి పెళ్లి చెయ్యాలని రెండు కుటుంబాలూ అనుకున్నాయి. ఐతే... కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబాల మధ్య ఆస్తి వివాదాలు వచ్చాయి. అవి రాన్రానూ పెద్దవయ్యాయి. దాంతో సంతోష్ కుటుంబం వేరే చోటుకి వెళ్లిపోయి అక్కడే ఉండసాగింది. ఆ తర్వాత ట్విస్ట్. ఆ యువతి గర్భం దాల్చింది. కారణం ఎవరంటే... సంతోషే అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుపట్టారు. తనకేమీ తెలియదనీ, ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని సంతోష్ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదన్నాడు.

ఎందుకు చేసుకోడో మేమూ చూస్తాం... అంటూ ఆమె తల్లిదండ్రులు అతనిపై రేప్ కేసు పెట్టారు. 2009 నవంబరులో పోలీసులు సంతోష్‌ని అరెస్టు చేశారు. 95 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో వున్నాడు. 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ లోగా ఆ యువతి ఓ పాప పుట్టింది. ఆ పాపకు DNA పరీక్షలు చేయగా, ఆమె తండ్రి సంతోష్ కాదని తేలింది. 2016, ఫిబ్రవరి 10న చెన్నై మహిళా కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చి తీర్పు చెప్పింది. దాంతో... అమ్మాయి తల్లిదండ్రులు సైలెంట్ అయ్యారు. అయితే... అప్పటికే... మీడియాలో సంతోష్‌పై నెగెటివ్ ప్రచారం జరిగింది. ఊళ్లో అందరూ అతన్ని రేపిస్టులా చూశారు. చేయని నేరానికి అతను... చేసినట్లుగా ముద్ర పడిపోయింది. ఈ కేసు కారణంగా అతను కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందలేకపోయాడు. ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: Eat Prawns to lose Weight: బరువు తగ్గాలా... రొయ్యలను ఈ విధంగా తినండి

తనపై అన్యాయంగా కేసు పెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని సంతోష్... ఆమె కుటుంబంపై పరువు నష్టం దావా వేశాడు. వాళ్లు పెట్టిన కేసు వల్ల తాను రూ.2 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వివరించాడు. తన పరువు తీసినందుకు రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును కోరాడు. దీనిపై కూడా సుదీర్ఘ విచారణ చేపట్టిన చెన్నై కోర్టు... ఒక కుర్రాడిపై కక్షతో రేప్ కేసు పెట్టి, అతన్ని మానసిక క్షోభ పెట్టారని మండిపడింది. తాజాగా రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశించింది. మన దేశంలో ఇలాంటి కేసులు దాదాపు లేవు. రేప్ జరిగిందని బాధితురాలు ఆరోపించగానే... అవతలి వ్యక్తిని రేపిస్టుగా చూసే పరిస్థితులు నేడున్నాయి. ఇలాంటి ఈ రోజులలో... తప్పుడు కేసు నుంచి నిర్దోషిగా అతను బయటపడటం మంచిదే. ఇంతకీ ఆమె కూతురుకి తండ్రి ఎవరన్నది మాత్రం పోలీసులు బయటపెట్టలేదు.
Published by: Krishna Kumar N
First published: November 22, 2020, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading