Home /News /crime /

RS 10000000000 DRUGS SEIZED IN GREATER NOIDA IN COUNTRYS BIGGEST RAID EVER NK

రూ.1000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్... దేశంలో జోరుగా మత్తు పదార్థాల స్మగ్లింగ్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Drugs Cases in India : ఏ అమెరికా లాంటి దేశాల్లోనో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయంటే... దక్షిణాన మెక్సికో నుంచీ వస్తుంటాయిలే అది కామనే అనుకోవచ్చు. కానీ ఇండియాలో డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువవుతుండటం ఆందోళన కలిగించే అంశమే.

మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం ఎంత డేంజరస్‌గా తయారవుతుందో బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్‌లో క్లియర్‌గా చూపించారు. చెడిపోయే యువతను తిరిగి మంచిదారిలో పెట్టడం ఎంత కష్టమో పోలీసులకూ, డాక్టర్లకూ తెలుసు. అలాంటి ప్రమాదకరమైన ఉచ్చులో ఇండియా చిక్కుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ బడితే అక్కడ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. తాజాగా నోయిడాలో... ఏకంగా రూ.1000 కోట్ల విలువైన డ్రగ్స్‌ని సీజ్ చేశారు. గత మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా స్యూడోఎఫిడ్రిన్ పెద్ద మొత్తంలో దొరకడం ఇదే తొలిసారి అని అధికారులు తేల్చారు. దేశంలో అత్యధికంగా మత్తు పదార్థాలను సీజ్ చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. మొత్తం 1,818 కేజీల స్యూడోఎఫిడ్రిన్‌ను, 1.9 కేజీల కొకైన్‌ను గ్రేటర్ నోయిడాలోని ఓ ఇంట్లో దాచిన వాటిని పట్టుకున్నారు. నైజీరియాకి చెందిన హెన్రీ ఇడియోఫర్ (35), మరో మహిళ చిమాండో ఒకోరా (30)ను అరెస్టు చేశారు.

చిత్రమేంటంటే ఓ IPS అధికారి ఇంటిని అద్దెకు తీసుకొని... అక్కడ డ్రగ్స్ తయారుచేస్తున్నారు. ఆ ఇంటిని డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చేశారు. డ్రమ్ముల్లో డ్రగ్స్ దాచిపెట్టారు. అంటే కేటుగాళ్లకు అసలు ఏమాత్రం భయం లేదని అర్థం చేసుకోవచ్చు.

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దక్షిణాఫ్రికాలోని నోమ్సా లుటాలోకి వెళ్తున్న 31 ఏళ్ల మహిళా ప్రయాణికురాలి దగ్గర ఉన్న బ్యాగులో 24.7 కేజీల స్యూడోఎఫిడ్రిన్ డ్రగ్స్ దొరికాయి. అవి మీకు ఎక్కడి నుంచీ వచ్చాయని అడిగితే ఫలానా వాళ్లు ఇచ్చారని చెప్పింది. అలా కూపీ లాగిన పోలీసులకు ఆ IPS అధికారి ఇంట్లో డొంక కదిలినట్లైంది.

సోకోట్రాఫిక్ మందులు, మత్తుపదార్థాల తయారీకి స్యూడోఎఫిడ్రిన్‌ను వాడుతారు. దీన్ని ఎక్స్‌పోర్ట్ చెయ్యాలంటే నార్కోటిక్స్ కమిషనర్ నుంచీ NOC తప్పనిసరి.

 

ఇవి కూడా చదవండి :

రవి ప్రకాశ్ ఎక్కడ..? గాలిస్తున్న పోలీసులు... సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్... నో క్లూ...

ఏపీలో కింగా, కింగ్ మేకరా... నేడు తేల్చనున్న పవన్ కళ్యాణ్...

IPL Final Match : ఫైనల్ మ్యాచ్‌కి సిద్ధమైన CSK, MI... జోరుగా బెట్టింగ్, బ్లాక్ టికెట్ల దందా

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?
First published:

Tags: Crime, Delhi, Drugs, Police, Smuggling

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు