హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: ట్రైన్ లో అందరి ముందే లేడీ ఆర్పీఎఫ్ పై అఘాయిత్యం.. కారణం ఏంటంటే..

OMG: ట్రైన్ లో అందరి ముందే లేడీ ఆర్పీఎఫ్ పై అఘాయిత్యం.. కారణం ఏంటంటే..

గాయపడ్డ మహిళా కానిస్టేబుల్

గాయపడ్డ మహిళా కానిస్టేబుల్

Tamil nadu: ట్రైన్ లో ఒక వ్యక్తి మహిళా కంపార్ట్ మెంట్ లో ఎక్కాడు. దీంతో అక్కడున్న వారంతా మహిళ ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

ప్రభుత్వాలు ఎన్నిచట్టలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారటం లేదు. గుడి, బడి, బస్టాండ్, రైల్టే స్టేషన్ లలో మహిళలు వేధింపులకు గురౌతున్నారు. ఇప్పటికే మహిళల కోసం తీసుకొచ్చిన దిశ, నిర్భయ, అభయ, పోక్సో వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన దుండగులు మాత్రం మారడం లేదు. కొన్ని చోట్ల బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు కూడా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలు సింగిల్ గా కన్పిస్తే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. తమిళనాడులోని (Tamil nadu) చెన్నైలో బీచ్ లోని రైల్వే స్టేషన్ లో దారుణ ఘటన సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి చెన్నై బీచ్ స్టేషన్ లోని సబర్బన్ రైలులో ఈ ఘటన జరిగింది. రైలు.. బీచ్ నుంచి చెంగ్ పేటకు వెళ్తుంది. అప్పుడు ఒక గుర్తుతెలియని దుండగుడు మహిళల కంపార్ట్ మెంట్ లోని ఎక్కాడు. దీంతో వారు.. అతడిని దిగిపోవాలని హెచ్చరించారు. అతను వీరి మాటలను పట్టించుకోలేదు. అక్కడున్న వారంతా.. మరోక కంపార్ట్ మెంట్ లోని వెళ్లిపోవాలని హెచ్చరించారు. అతను వినకపోవడంతో వెంటనే మహిళ ఆర్పీఎఫ్ అధికారిణికి ఫిర్యాదు చేశారు.అక్కడికి ఆశీర్వ లేడీ కానిస్టేబుల్  చేరుకున్నారు. దీంతో అతగాడు మహిళ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా.. కత్తితీసుకుని ఇష్టమోచ్చినట్లు ఆమె మెడపై పొడిచాడు. ఆ తర్వాత.. రైలు నుంచి దూకిపారిపోయాడు. వెంటనే ఆమెను తోటి ప్రయాణికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకొవడానికి ప్రత్యేకంగా పోలీసులను రంగంలోనికి దింపారు.


ఇదిలా ఉండగా దొంగ, పోలీసులకు ఒక రేంజ్ లో చుక్కలు చూపించాడు.


పూర్తి వివరాలు.. ఒక దొంగను పోలీసులు జీప్ లో ఛేజింగ్ చేస్తున్నారు. అతను స్కూటీపై ధూమ్ స్టైల్ లో చక్మా ఇచ్చాడు. అంతే కాకుండా.. పోలీసులకు దొరక్కుండా స్కూటీ మీద కట్స్ కొడుతూ ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు అతగాడు ఒక వంపు మార్గం రాగానే దానిలోపలికి పొనిచ్చాడు. అప్పుడు.. దిమ్మ తిరిగే ఘటన జరిగింది. స్కూటీ మీద ప్రయాణిస్తున్న దొంగ.. మరో మార్గంలోనికి పొనిచ్చాడు. అప్పుడు.. అతనికి ఎదురుగా ఒక సుమో వాహనం ఆగి ఉంది.


అతను వేగంగా వెళ్లి.. వెహికిల్ వెనుక నుంచి యూటర్న్ చేసుకుని వచ్చిన మార్గం గుండా తిరిగి వెళ్లిపోయాడు. పాపం.. పోలీసులు స్కూటీ అంత వేగంగా తమ వాహనం టర్న్ చేయలేక అక్కడే ఉండిపోయారు. అంతే కాకుండా.. పోలీసులు వెహికిల్ దిగి.. అతగాడి కోసం వెనుకవైపుకు వచ్చి మరీ చూశారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు (Netizens) ఇదేం తెలివిరా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు వీడిది మాములు బుర్రకాదంటూ నవ్వుతూ ఎమోజీలను పెడుతున్నారు.Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, Railway Police, Tamil nadu

ఉత్తమ కథలు