పోలీస్ స్టేషన్ ఎదుటే 108 అంబులెన్స్‌ను తగులబెట్టిన రౌడీషీటర్

దగ్ధమైన అంబులెన్స్

దగ్ధమవుతున్న 108 వాహనంలోనే నిందితుడు ఉండటంతో బయటకు రమ్మన్ని పోలీసులు హెచ్చరించారు. ఐనా బయటకు రాకండా విచిత్రంగా ప్రవర్తించడంతో.. చాకచక్యంగా అతడిని బయటకు లాగేశారు.

  • Share this:
    ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. పోలీస్ స్టేషన్ ఎదుటే 108 అంబులెన్స్ వాహనాన్ని తగులబెట్టాడు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ అనే రౌడీ షీటర్ 108 పదే పదే రాంగ్ కాల్స్ చేయడంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా.. అక్కడ హల్ చల్ చేశాడు సురేష్. పోలీస్ స్టేషన్ కార్యాలయ అద్దాలు పగలగొట్టాడు. వింత వింతగా ప్రవర్తించడంతో.. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు గుర్తించారు. సురేష్ చేతికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు రప్పించారు.


    అనంతరం 108 వాహనం ఎక్కిన సురేష్ వెంటనే వాహనం అద్దాలు పగులగొట్టి.. అందులో ఉన్న స్పిరిట్‌తో అంబులెన్స్‌ను తగులబెట్టాడు. దగ్ధమవుతున్న 108 వాహనంలోనే నిందితుడు ఉండటంతో బయటకు రమ్మన్ని పోలీసులు హెచ్చరించారు. ఐనా బయటకు రాకండా విచిత్రంగా ప్రవర్తించడంతో.. చాకచక్యంగా అతడిని బయటకు లాగేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఐతే అప్పటికే అంబులెన్స్ చాలా వరకు కాలిపోయింది. ఘటనలో గాయపడిన సురేష్‌ను ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: