సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. తొలుత 30 ఎకరాల భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఓ రౌడీ షీటర్.. వేేరే వర్గంపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒక్కరికి గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌కు చెందిన కమల్ కిశోర్‌కు గోవిందపూర్ శివారులోని జీడిగడ్డతాండ గ్రామంలోని 104 , 105 సర్వే నెంబర్లలోని 31 ఎకరాల భూమిలో కూలీలతో కడీలు వేయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్‌కు చెందిన అలీ అక్బర్, అస్రద్‌లు జీడిగడ్డతాండకు వెళ్లారు. కమల్ కిశోర్ కడీలు వేయించే భూమిలో కొంత తమ ల్యాండ్ ఉందంటూ అలీ అక్బర్ వర్గం గొడవకు దిగింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలోనే అలీ అక్బర్ జహీరాబాద్‌కు చెందిన లాయక్ అనే రౌడీ షీటర్‌ను రంగంలోకి దించాడు.
అలీ అక్బర్ ఫోన్ చేయడంతో లాయక్ ఘటన స్థలానికి చేరుకున్నాడు. తన వద్ద కత్తులతో కమల్ కిశోర్ వర్గంపై దాడికి దిగాయి. అలాగే తుపాకీతో ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడున్న భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక్కరు గాయపడ్డారు. అనంతరం ఈ ఘర్షణకు సంబంధించి కమల్ కిశోర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అలీ అక్బర్, అస్రద్‌లను అదుపులోకి తీసుకున్నారు.
అయితే లాయక్ పరారీలో ఉండటంతో.. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తుపాకీతో కాల్పులు జరిపి.. ప్రజలను భయాందోళనకు గురిచేసిన లాయక్‌పై జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచారు. ఇక, లాయక్‌పై రెండేళ్ల క్రితం హత్యకు సంబంధించిన కేసు నమోదు అయిందని పోలీసులు తెలిపారు.