ROWDY SHEETER BRUTALLY MURDERED BY UNKNOWN PERSON WHILE HE WAS SITTING ON FOOTPATH IN VISAKHAPATNAM HSN
Visakhapatnam: త్వరలో నిన్ను చంపేస్తాం.. అని ఇంటికెళ్లి బెదిరించి మరీ రౌడీషీటర్ దారుణ హత్య.. విశాఖలో కలకలం
ప్రతీకాత్మక చిత్రం
అతడి ఇంటికి కొద్ది రోజులుగా కొంత మంది యువకులు తరచూ వచ్చి ’త్వరలో నిన్ను లేపేస్తాం‘ అంటూ బెదిరించసాగారు. వాళ్ల వయసును చూసి, వాళ్లను చూసి అతడు నవ్వుకున్నాడంతే. వారి గురించి అస్సలు పట్టించుకోలేదు. కానీ అతడు ఊహించని ఘోరం జరిగింది.
విశాఖపట్టణంలో అతడో పేరు మోసిన రౌడీ షీటర్. ఒకటికి రెండు హత్య కేసులు అతడిపై ఉన్నాయి. అతడి ఇంటికి కొద్ది రోజులుగా కొంత మంది యువకులు తరచూ వచ్చి ’త్వరలో నిన్ను లేపేస్తాం‘ అంటూ బెదిరించసాగారు. వాళ్ల వయసును చూసి, వాళ్లను చూసి అతడు నవ్వుకున్నాడంతే. వారి గురించి అస్సలు పట్టించుకోలేదు. కానీ అతడు ఊహించని ఘోరం జరిగింది. మంగళవారం రాత్రి ఫుట్ పాత్ పై తెలిసిన కుర్రాళ్లతో పిచ్చాపాటీ మాట్లాడుతోంటే సడన్ గా అతడి ముందు ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో దిగారు. విచక్షణారహితంగా అతడిపై అటాక్ చేశారు. దీంతో ఆ రౌడీ షీటర్ అక్కడికక్కడే మరణించాడు. విశాఖపట్టణంలోని మద్దిలపాలెం సమీపంలోని జయభేరి షోరూమ్ డౌన్ ల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖలోని కేఆర్ఎం కాలనీకి చెందిన 32 ఏళ్ల సనా వెంకటరెడ్డి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి బండ్రెడ్డి అనే మరో పేరు కూడా ఉంది. బండ్రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అల్లీపురం ప్రాంతానికి చెందిన ఆయిల్ రాము మర్డర్ కేసుతోపాటు కేఆర్ఎం కాలనీలో జరిగిన బాక్సర్ సంతోష్ హత్య కేసులో బండ్రెడ్డి ప్రధాన నిందితుడు. అతడిపై ఎంవీపీ పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు. కొన్నాళ్లుగా బండ్రెడ్డి ఇంటికి కొంత మంది యువకులు వచ్చి ’నిన్ను త్వరలోనే లేపేస్తా‘ అని బెదిరించసాగారు. ఈ విషయం తెలిసిన బండ్రెడ్డి అంతగా పట్టించుకోలేదు. అసలు వాళ్లతో గతంలో గొడవలు జరిగిన దాఖలాలు కూడా లేకపోవడంతో లైట్ తీసుకున్నాడు.
మంగళవారం రాత్రి రోజూగానే జయభేరి షోరూమ్ డౌన్ లో ఫుట్ పాత్ పై ముగ్గురు తెలిసిన కుర్రాళ్లతో కలిసి కూర్చుకున్నాడు. చాలా సేపు మాట్లాడారు. ఆ తర్వాత ఆ ముగ్గురు యువకులు వెళ్లిపోయారు. బండ్రెడ్డి ఒక్కడే ఫుట్ పాత్ పై ఉన్న సమయంలో అతడి ముందుకు ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో దిగారు. హఠాత్తుగా బండ్రెడ్డిపై దాడి చేశారు. ఆ దాడిలో బండ్రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. అతడు మరణించాడని నిర్ధారణ అయ్యాక కార్లో వాళ్లు పారిపోయారు. బండ్రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా, గతేడాది డిసెంబర్ నెలలో విశాఖ జిల్లాలోని కోరాడ సాయి అనే రౌడీ షీటర్ కూడా దారుణ హత్యకు గురయ్యాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.