ఆలయ ఉత్సవాల్లో రౌడీ షీటర్‌పై వేటకొడవళ్లతో...

తమిళనాడు మదురైలో ఆలయ ఉత్సవాల్లో రౌడీ షీటర్‌ను ప్రత్యర్థులు వేడకొడవళ్లతో నరికి చంపారు. రౌడీ షీటర్‌పై హత్య, దోపిడీ తదితర పలు కేసులు విచారణలో ఉన్నాయి.

news18-telugu
Updated: July 20, 2019, 9:04 PM IST
ఆలయ ఉత్సవాల్లో రౌడీ షీటర్‌పై వేటకొడవళ్లతో...
ఆలయ ఉత్సవాల్లో రౌడీ షీటర్ దారుణ హత్య
  • Share this:
పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతుండగా...ఆలయ ఉత్సవాల్లో పట్టపగలే ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురైయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని మదురైలో కలకలం సృష్టించింది. ఆషాడ(ఆడి) మాసాన్ని పురస్కరించుకుని వైగై నది ఒడ్డునున్న ఓ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయ దర్శనానికి తరలివచ్చారు. స్థానిక రౌడీ షీటర్ రాజశేఖర్  కూడా ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

రాజశేఖర్ భక్తుల మధ్య ఉన్న సమయంలోనే...సినీ ఫక్కీలో ఏడుగురు వ్యక్తుల ముఠా అతనిపై వేటకొడవళ్లతో దాడి చేసింది. భయబ్రాంతులైన భక్తులు అటూ ఇటూ పరుగులు తీశారు.  రాజశేఖర్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...రాజశేఖర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్‌పై వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చిన ఏడుగురు వ్యక్తులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

రౌడీ షీటర్ రాజశేఖర్ మీద హత్య, దోపిడీ తదితర పలు కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో బెయిల్‌పై  బయట ఉన్నాడు.  పాత కక్షల కారణంగానే రౌడీ షీటర్ రాజశేఖర్‌‌‌ ‌ను ప్రత్యర్థులు నరికిచంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...