shocking news :ఇండిపెండెంట్ డే రిహార్సల్స్... భగత్‌సింగ్ పాత్రలో నిజంగానే బిగుసుకున్న ఉరి

ప్రతీకాత్మక చిత్రం

Shocking news : దేశ స్వాతంత్య్రోద్యమంలో అసువులు బాసిన భగత్‌సింగ్ పాత్ర వేయడం ద్వార స్కూళ్లో మంచి పేరు సాధించాలని ఓ విద్యార్థికి విషాదం మిగిలింది.. ఆపాత్రలో విలీనంపై ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆ బాలుడు ఉరి బిగిసి నిజంగానే ప్రాణాలు కోల్పోయాడు...

  • Share this:
    భగత్ సింగ్ పాత్రలో విలీనమైన ఓ పదేళ్ల బాలుడికి నిజంగానే ఉరిపడింది.. భగత్ సింగ్ ప్రదర్శనకు రిహార్సల్స్ చేస్తున్న సమయంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..ఆగస్టు పదిహేను ఇండిపెండెంట్ డే సంధర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని కువర్‌గావ్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూళ్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు రిహార్సల్స్ కొనసాగుతున్నాయి..

    అయితే ఈ రిహార్సల్స్‌లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాత్రతో ఓ సన్నివేశం చేయాలని స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది..ఇందుకు సంబంధించి అయిదవ తరగతి చదువుతున్న పదేళ్ల శివమ్ అనే విద్యార్థితో పాటు మరికొంత మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భగత్ సింగ్‌ను ఉరి సన్నివేశం పై రిహార్సల్స్ కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలోనే ఆ విద్యార్థి మెడకు ఉరివేసుకుని కాళ్ల కింద ఎత్తైన పీట వేసుకున్నాడు.

    అయితే ప్రాక్టీస్‌లో మునిగిపోయిన శివమ్‌కు కాళ్ల కింద ఉన్న ఎత్తైన పీట జారీ పక్కకు జరిగిపోవండంతో మెడకు ఉన్న తాడు నిజంగానే బిగుసుకుంది. దీంతో విద్యార్థి కాళ్లు కొట్టుకుంటుండడంతో ఏం తోచని విద్యార్థులు కేకలు వేశారు...ఈ కేకలు విన్న శివమ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే శివమ్‌కు ఉన్న తాడును తీసి ఆసుపత్రికి తరలించారు..అయితే తాడు బిగుసుకోవడంతో అక్కడిక్కడే చనిపోయినట్టు వైద్యులు దృవికరించారు..

    అయితే ఈ సంఘటనపై శివమ్ తల్లిదండ్రులు ఎలాంటీ కేసును పెట్టలేదు..కనీసం పోలీసులకు సమాచారం కూడా అందించలేదు...బాలుడు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే అంత్యక్రియలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. అయితే జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్టు చెప్పారు. కాగా ఈ సంఘటన రెండు రోజుల క్రితం చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగు చూసింది.
    Published by:yveerash yveerash
    First published: