Home /News /crime /

ROMANTIC COUPLE DID THIS THING ON A MOVING BUS HAS CAUSED A STIR SSR

Shocking Incident: రన్నింగ్ బస్‌లో ఈ బావామరదలు చేసిన పనికి కాసేపు ఎవరికీ ఏం అర్థం కాలేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాళ్లిద్దరూ బావామరదళ్లు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. వరసయ్యే వాళ్లే కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పగా వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.

    విలుప్పురం: వాళ్లిద్దరూ బావామరదళ్లు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. వరసయ్యే వాళ్లే కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పగా వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తోడుగా ఉండాలని భావించి స్నేహం చేసిన ఆ బావామరదలు పెద్దలు పెళ్లికి ‘నో’ చెప్పడంతో తట్టుకోలేకపోయారు. వేరొకరిని జీవిత భాగస్వామిగా ఊహించుకోలేమని తీవ్ర మనస్తాపం చెందారు.

    క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. కలిసి బతకలేకపోయినా కలిసి చనిపోవాలనుకున్నారు. బస్సులో వెళుతూ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విలుప్పురం జిల్లాకు చెందిన రాజేష్ అనే యువకుడు లోకేశ్వరి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె అతనికి వరసకు మరదలు అవుతుంది. కాంచీపురం జిల్లాకు చెందిన లోకేశ్వరి కూడా రాజేష్‌ను ఇష్టపడింది.

    ఇది కూడా చదవండి: Viral Video: ఈ ప్రేమ జంట మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వెళితే ఊహించని ఘటన జరిగింది..

    బావామరదలు కలిసి తమ ప్రేమ విషయాన్ని, పెళ్లి చేసుకోవాలని భావిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు. అయితే.. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో.. ఈ ప్రేమ జంట బెంగళూరు వెళ్లిపోయి కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని నగరానికి చేరుకున్నారు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. అయితే.. ఇంతలో నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో తెలియదు బెంగళూరులో సాలెం వెళ్లే గవర్నమెంట్ బస్సు ఎక్కారు. బస్సు సాలెంకు కొద్దిసేపట్లో చేరుకుంటుందనగా ఇద్దరూ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. బస్సులో ఇద్దరూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోవడంతో తోటి ప్రయాణికులు వారిని హుటాహుటిన దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

    ఇది కూడా చదవండి: OMG: మదనపల్లె ఘటనను మించిపోయిందిగా.. నిండు పౌర్ణమి రోజున ఏం చేశాడో చూడండి..

    పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో బెంగళూరు వెళ్లిన ఈ జంట సాలెం వెళ్లే బస్సు ఎక్కి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మెరుగైన చికిత్స నిమిత్తం వీరిని సాలెంలోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఇద్దరూ బయటపడ్డారని డాక్టర్లు తెలిపారు. వెళుతున్న బస్సులో ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం చేయడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఊహించని ఈ పరిణామంతో నివ్వెరపోయారు. సకాలంలో రాజేష్‌ను, లోకేశ్వరిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సాలెంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమ జంట క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కడుపు కోత మిగల్చవద్దని పోలీసులు సూచించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Lovers, Lovers suicide, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు