హోమ్ /వార్తలు /క్రైమ్ /

Robbery: అర్రే ఏం ప్లాన్ చేశార్రా.. ఆ సినిమా ఎన్నిసార్లు చూసి ఈ రేంజ్ ప్లాన్ చేసి ఏకంగా పొలిటీషియన్‌నే దోచేశారు!

Robbery: అర్రే ఏం ప్లాన్ చేశార్రా.. ఆ సినిమా ఎన్నిసార్లు చూసి ఈ రేంజ్ ప్లాన్ చేసి ఏకంగా పొలిటీషియన్‌నే దోచేశారు!

దొంగ‌ల‌కు రోజు రోజుకు క్రియేటివిటీ పెరిగిపోతుంది. బీహార్ దొంగ‌లు ఓ సినిమా చూసి తామేం త‌క్కువ అనుకొన్నారో ఏమో.. ఆ సినిమాలోని దొంగ‌ల గ్యాంగ్‌లాగా స్కెచ్ వేసి ఏకంగా ఓ స్థానిక పొలిటీషియ‌న్ ఇంట్లోనే రూ.25 ల‌క్ష‌లు కొట్టేశారు.

  దొంగ‌ల‌కు రోజు రోజుకు క్రియేటివిటీ పెరిగిపోతుంది. హిందీలో అక్ష‌య్‌కుమార్ న‌టించిన స్పెష‌ల్ 26 (Special 26) సినిమాను త‌మిళంలో తాన సెంద్ర కొట్ట‌మ్ అని సూర్య త‌మిళంలో రిమేక్ చేశాడు. అదే తెలుగులో గ్యాంగ్ సినిమాగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరో ఓ గ్రూప్‌ను వేసుకొని ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌ (Income Tax Officers) ల‌మ‌నిచెబుతూ చిత్ర విచిత్ర ప‌ద్ధ‌తుల్లో దొంగ‌త‌నాలు చేస్తారు. హిందీలో ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది. తెలుగులోనూ ఓ మోస్త‌రుగా ఆడింది. బీహార్ దొంగ‌లు ఈ సినిమా చూసి తామేం త‌క్కువ అనుకొన్నారో ఏమో.. సినిమాలోని ఐడియాను కాపీ కొడుతూ పోలిటీషియ‌న్ ఇంట్లోనే దొంగ‌త‌నం చేశారు.. ఏకంగా రూ.25 ల‌క్ష‌లు చోరీ చేశారు.

  Crime News: మ‌రొక‌రితో అక్ర‌మ‌ సంబంధం పెట్టుకొంద‌ని అనుమానం.. బ్రేక‌ప్ చెప్పింద‌నే కోపంతో..

  బీహార్‌ (Bihar) లోని లఖిసరాయ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కబయ్యా ఇది పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వీధిలో బలుతేకేదార్ అనే కాస్త ధ‌నవంతుడు నివాసం ఉంటున్నాడు. ప్ర‌స్తుతం స్థానిక రాజ‌కీయాల్లో చుర‌గ్గా ఉన్నాడు కూడా.. దొంగ‌ల క‌న్ను ఆయ‌న‌పై ప‌డింది. సోమవారం మధ్యాహ్నం బలుతేకేదార్ సంజయ్ కుమార్ సింగ్ ఇంటి వద్ద స్కార్పియో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు వచ్చారు. తాము  ఆదాయ‌పు శాఖ (ఇన్‌కం టాక్స్‌)  అధికారుల‌మ‌ని చెప్పారు. ఆయుధం ఉంద‌ని చూపించి విచార‌ణ ప్రారంభించారు.

  ఇంట్లో ఉన్న‌న‌గ‌లు, డ‌బ్బు లెక్క చూపించ‌మ‌ని అడిగారు. ఏదైదో మాట‌లు చెప్పి రూ.25ల‌క్ష‌లు, న‌గ‌లు సీజ్ చేస్తున్నామ‌ని ప‌ట్టుకొని పోయారు. అయితే కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చి పోలీసు (Police) ల‌కు స‌మాచారం ఇవ్వ‌మ‌ని ఒత్తిడి చేయ‌డంతో బలుతేకేదార్ కవయ్య పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థలానికి పోలీసులు చేరుకొన్నారు. దీనిపై SDPO రంజన్ కుమార్ మాట్లాడారు. ప్రస్తుతం ఇంట్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీ ఆధారంగా వాహనం నంబర్‌ను పరిశీలిస్తున్నామ‌ని తెలిపారు. సోదాలు పూర్త‌యిన త‌ర్వాత దొంగ‌ల‌ను ప‌ట్టుకొంటామ‌ని తెలిపారు.

  Viral Marriage: చెల్లిని అత్త‌గారింటికి తీసుకొచ్చాడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే?

  రెండేళ్ల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ..

  ఇటువంటి ఘ‌ట‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) నెల్లూరులోనూ రెండేళ్ల క్రితం జ‌రిగింది. ఓ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో నెల్లూరు ప‌ట్ట‌ణంలోని ఓ అపార్ట్మెంట్‌కు ముగ్గురు వ్య‌క్త‌లు వ‌చ్చారు. తాము ఎన్ఫోర్స్మెంట్ అధికారులమని వాచ్‌మెన్‌కు చెప్పి లోప‌లికి వెళ్లారు. ఓ ఇంట్లోకి వెళ్లి రాత్రి ఒంటిగంట వరకు సోదాలు చేసిన వారు ఇంట్లోని 35 సవర్ల బంగారు ఆభరణాలు, 10.30 లక్షల రూపాయల నగదు, 10 కేజీలకు పైగా వెండి వస్తువులు తీసుకొని అక్కడి నుంచి జారుకున్నారు. దొంగ‌లు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఇంటి య‌జ‌మాని మోసపోయానని తెలుసుకున్నాడు. అసలు వచ్చిన వారు అధికారులే కాదని నిర్ధారించుకున్నారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

  First published:

  Tags: Bihar, Crime news, Robbery