పోలీస్ థర్డ్ డిగ్రీ పనిష్‌మెంట్.. హాకీ స్టిక్‌తో..

దొంగతనం కేసులో యువకుడిని చితకబాదుతున్న ఎస్ఐ

యువకుడిని తాళ్లతో కట్టేసి హాకీ స్టిక్‌ విరగేదాకా పాదాలపై విపరీతంగా కొట్టారు.నొప్పిని భరించలేక యువకుడు హాహాకారాలు పెట్టాడు.

  • Share this:
    కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న సుబ్రహ్మణ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఓ యువకుడికి థర్డ్ డిగ్రీ పనిష్‌మెంట్ ఇస్తున్న వీడియో బయటకు లీక్ అయింది.ఎస్ఐ శ్రీకాంతె గౌడ ఓ యువకుడిని హాకీ స్టిక్‌తో విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి.యువకుడిని తాళ్లతో కట్టేసి హాకీ స్టిక్‌ విరిగేదాకా పాదాలపై విపరీతంగా కొట్టారు.నొప్పిని భరించలేక యువకుడు హాహాకారాలు పెట్టాడు. దొంగతనం  కేసులో ఆ యువకుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.థర్డ్ డిగ్రీ వీడియో బయటకు లీక్ అవడంతో బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు శ్రీకాంతె గౌడను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
    First published: