( Mahender new 18, Nizamabad )
నిజామాబాద్‌లో దుండగులు రెచ్చి పోయారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ పెట్రోల్ బంకులో దోపిడికి పాల్పడ్డారు. స్థానిక సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రం లోని ఓ పెట్రోల్ బంక్ పై పది మందికి పైగా గుర్తు తెలియని దుండగులు వెనుక వైపు నుండి వచ్చి రాళ్లతో మెరుపు దాడి చేశారు. దీంతో బంకులో పనిచేసే రాందాస్ కు స్వల్పంగా గాయపడడంతో అక్కడి నుండి బయటకు పరుగెత్తాడు.
ఇదే అదనుగా బావించిన దుండగులు బంకు లోని క్యాష్ కౌంటర్ ను తీసుకొని వెనుక వైపు నుండే పొలాల్లో గుండా పరారయ్యారు. క్యాష్ కౌంటర్లో 60 వేల వరకు నగదు ఉండగా దుండగులు ఎత్తుకెళ్తుండగా అందులో నుండి 20 వేలు బంకు వెనుక వైపున పడి పోయాయి. ఈ సమయంలోనే రాందాస్ కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు వచ్చి గాలించిన ప్పటికి వారి ఆచూకీ తెలియలేదు.
Nalgonada : ముందుగా ప్రభుత్వ ఉద్యోగి.. ఆ తర్వాత 6గురు స్నేహితులు.. యువతిపై లైంగిక దాడి. ఫలితంగా..!
దుండగుల రాళ్ల దాడిలో గది అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. సీఐ సిబ్బందితో కలిసి
చుట్టు పక్కల గాలింపు చేపట్టినప్పటికీ దుండగుల జాడ కనిపించలేదు. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి సీపీ నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై వివరాలను సేకరించారు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
KTR : వాహ్... వాట్ ఏ బంపర్ ఆఫర్.. ఇది ఏపీకేనా... ? చీప్ లిక్కర్‌పై కేటిఆర్ ట్వీట్..!
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang robbery, Nizamabad