Robbery: నిజామాబాద్ లో దొంగల బీభత్సం.. రాళ్లతో దాడి చేసి దోచుకెళ్లిన వైనం!

ప్రతీకాత్మక చిత్రం

Nizamabad Robbery: నిజామాబాద్ జిల్లాలో దొంగలు తెగబడ్డారు. మాస్కులు ధరించి, రాళ్లతో దాడులు చేస్తూ పెట్రోల్ బంకులోకి చొరబడ్డారు. అందిన కాడికి దోచుకెళ్లారు.

  • Share this:
    నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పెట్రోల్ బంక్ లోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. మొఖాలకు మాస్కులు ధరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం నలుగురు దొంగలు దోపిడీలో పాల్గొన్నారు. అందులో ముగ్గురు ఏకంగా క్యాష్ కౌంటర్ నే ఎత్తుకెళ్లారు. మరొకరు ఆఫీస్ రూంలోకి ప్రవేశించి పేపర్లు, డబ్బులు ఎత్తుకెళ్లారు. వివరాల ప్రకారం.. బోధన్ పట్టణానికి కూతవేటు దూరంలో నర్సిరోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ లోకి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దొంగలు మాస్కులు ధరించి, సంచిలో రాళ్లతో ప్రవేశించారు.

    పెట్రోల్ బంక్ వెనక ఉన్న ఇనుప కంచెను కత్తిరించి లోనికి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఒక్క సారిగా అక్కడ ఉన్న సిబ్బందిపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో వారు భయంతో పారి పోయారు. అనంతరం ముగ్గురు క్యాష్ కౌంటర్ ను ఎత్తుకెళ్లగా.. మరొకరు ఆఫీస్ లోకి చొరబడి డబ్బులు పేపర్లను తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దోపిడీ జరిగిన విధానాన్ని పరిశీలిస్తే పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు అర్థమవుతోంది. ఈ  విషయం తెలుసుకున్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇది స్థానిక దొంగల పనా? లేక ఇతర రాష్ట్రాల దొంగల హస్తం ఉందా అన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతోంది. బంకు నిర్వాహకులు సమాచారం అందించడంతో ఏసీపీ రామారావు, సీఐ రాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
    Published by:Nikhil Kumar S
    First published: