Crime News: దొంగతనానికి వచ్చారు.. యజమాని చేతిలో రూ.500 పెట్టి.. చివరకు ఏం చేశారో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: వీళ్లు విచిత్రమైన దొంగలు(Strange thieves). ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చి.. నగదు(Money) దొంగిలించారు. దొంగిలించిన నగదు, బంగారం తీసుకెళ్తూ.. ఆ ఇంటి యజమాని చేతిలో రూ.500 పెట్టి కాళ్లకు మొక్కారు. అంతే కాకుండా ఆరు నెలల తర్వాత తిరిగి ఇచ్చేస్తామంటూ.. హామీ ఇచ్చి వెళ్లిపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  దొంగలు(Thieves) సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా దంగతనం చేసే ముందు రెక్కీ నిర్వహించి దొంగతనం చేస్తారు. అందినకాడికి దోచుకెళ్తారు. అవసరం అనుకుంటే ప్రాణాలకు కూడా తీస్తారు. కానీ ఇక్కడ మనం చెప్పుకునే దొంగల వ్యవహారం కూడా విచిత్రంగా ఉంది. దొంగతనానికి వచ్చిన వాళ్లు.. ఇంటి ఓనర్లను బెదిరించి.. ఇంట్లో ఉన్న సామాన్లను ఎత్తుకెళ్లారు. వాటిని తీసుకెళ్తూ.. వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చిప్పారు. మళ్లీ మీ డబ్బును మీకు తిరిగిచ్చేస్తామని చెప్పి.. అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఉత్తర ప్రదేశ్(Uttara Pradesh) రాష్ట్రంలో ఘజియాబాద్‌(Ghaziabad)లో చోటు చేసుకుంది. దొంగతనం (Theft) చేసిన తర్వాత.. వృద్ధ దంపతులకు కాళ్లు మొక్కి..మరలా ఇచ్చేస్తాం అంటూ వెళ్లిపోయారు దొంగలు. అవును మీరు విన్నది నిజమే.. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

  ఘజియాబాద్(Ghaziabad).. రాజ్ నగర్(Rajnagar) లో సురేంద్ర వర్మ(Surender Varma), భార్య అరుణ వర్మ(Aruna Varma) వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు(Daughters). వారందరికీ వివాహాలు(Marriages) అయ్యాయి. కుమార్తెలు తమ తమ కుటుంబాలతో విదేశాలలో నివసిస్తున్నారు. సురేంద్ర వర్మ కొంతకాలం క్రితం వరకు ఘజియాబాద్‌(Ghaziabad)లోని బులంద్‌షహర్ రోడ్ ఇండస్ట్రియల్(Industrial) ఏరియాలో ఒక ఫ్యాక్టరీని నడిపాడు.

  ఇది చదవండి: వృద్ధురాళ్లపై లైంగిక దాడి.. నిందితుల్లో ఒకరికి 22 ఏళ్లు.. మరొకరికి 32 ఏళ్లు..

  ప్రస్తుతం అది మూసివేశారు. అయితే.. ఇటీవల రాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు అతని ఇంట్లోకి ప్రవేశించారు. ముసుగులు ధరించిన వీరి చేతిలో కత్తులు(Knifes), తుపాకీ ఉన్నాయి. దుండగులు గ్యాస్ కట్టర్‌తో ఇనుప తలుపును కట్ చేసి, ఆపై గాజు పగులగొట్టి సురేంద్ర వర్మ ఇంట్లోకి ప్రవేశించారు. అలా ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు(Thugs).. తమ వద్ద ఉన్న ఆయుధాలతో వృద్ధ దంపతులను బెదిరించారు. అలా ఇంట్లో ఉన్న ఒకటిన్నర లక్షల రూపాయల నగదు, సుమారు నాలుగు లక్షల రూపాయల విలువ చేసే నగలు దోచుకున్నారు.

  ఇది చదవండి: అక్టోబర్​ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..

  ఆ తరువాత ఇంటి నుంచి పారిపోతూ.. బాధిత వృద్ధ దంపతుల పాదాలను తాకారు. ఆరు నెలల(Six Months) తర్వాత తాము దోచుకున్న డబ్బు, బంగారం మొత్తం తిరిగి ఇచ్చేస్తాం అని అన్నారు. అంతేకాదు.. ఆ దొంగ బాధిత వృద్ధ దంపతులకు రూ. 500 లు చేతిలో పెట్టి, వారి కాళ్లకు నమస్కరించి, క్షమాపణలు(Apologies) చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది చూసిన ఆ వృద్ధ దంపతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దోపిడీపై సమాచారం అందుకున్న కవినగర్ పోలీస్(Kavinagar) స్టేషన్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

  ఇది చదవండి: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..

  దొంగల చేతుల్లో మారణాయుధాలు ఉండడంతో వృద్ధ దంపతులు ఏమీ చేయలేకపోయారు. వచ్చిన దొంగలు తామకు కాళ్లు మొక్కారని.. అంతే కాకుండా చేతిలో రూ.500 పెట్టి ఆరు నెలల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని చెప్పారని ఆ దంపతులు పోలీసులకు వివరించారు. అలాగే తమను కలవరపడవద్దని.. తిరిగి మళ్లీ ఆ డబ్బులను ఇచ్చేస్తమని కూడా చెప్పినట్లు తెలిపారు. దంపతులు ఫిర్యాదు(Complaint) మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు(Police) తెలిపారు.
  Published by:Veera Babu
  First published: