జైల్లో నుంచి పెరోల్‌పై బయటకివచ్చి పోలీసులకే షాకిచ్చిన దొంగ.. ఏం చేశాడంటే..

జైలులో శిక్ష అనుభవిస్తు పెరోల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి పోలీసు రివాల్వర్‌ను దొంగిలించాడు. ఐదుగురు పోలీసులు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ఆ వ్యక్తి సర్వీస్ రివాల్వర్‌తో పాటు పది బులెట్లను దొంగిలించాడు.

news18-telugu
Updated: November 23, 2020, 9:57 AM IST
జైల్లో నుంచి పెరోల్‌పై బయటకివచ్చి పోలీసులకే షాకిచ్చిన దొంగ.. ఏం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జైలులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి పోలీసు రివాల్వర్‌ను దొంగిలించాడు. ఐదుగురు పోలీసులు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ఆ వ్యక్తి సర్వీస్ రివాల్వర్‌తో పాటు పది బులెట్లను దొంగిలించాడు. ఆ రివాల్వర్‌తో జ్యూవెలరీ షాప్ యజమానులను బెదిరించి చోరీలకు పాల్పడాలని భావించాడు. అయితే నిందితుడి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్ పోలీసు సంజయ్ భాటియా తెలిపిన వివరాల ప్రకారం.. దోపిడి కేసులు అరెస్ట్ అయి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జైలకు వెళ్లాడు. ఆపెరోలుపై బయటకు వచ్చాడు. 45 రోజులు పెరోల్ గడువు ముగిసిన తర్వాత అతడు నవంబర్ 30న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే పెరోల్‌పై బయటకు వచ్చిన అతుల్ తన పద్దతి మార్చుకోలేదు. తిరిగి దొంగతనాలు చేయసాగాడు.

ఈ క్రమంలోనే దక్షిణ ఢిల్లీలోని కిషన్‌ఘర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చోరికి వెళ్లాడు. అయితే అందులో ఐదుగురు పోలీసులు అద్దెకు ఉంటున్నారనే విషయం అప్పుడు అతనికి తెలియదు. ఇంట్లో చోరి చేసే సమయంలో ఓ బ్యాగ్‌లో ఢిల్లీలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రివాల్వర్ కనిపించింది. దీంతో అతడు రివాల్వర్, పది బులెట్లను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే తన రివాల్వర్ కనిపించక పోవడం కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో పోలీసు శాఖ రివాల్వర్‌ను దొంగిలించిన వ్యక్తి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టింది.

ఇక, అతుల్ తొలుత ఆ రివాల్వర్‌ను మంచి ధరకు బయట అమ్మవచ్చని అతుల్ అనుకున్నాడు. కానీ ఆ తర్వాత తన పాట్నర్స్ విపిన్, విశాల్‌లతో కలిసి దోపిడిలకు ప్లాన్ చేశాడు. రివాల్వర్‌తో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కరోల్ బాగ్ ప్రాంతంలో బంగారం చోరికి ప్లాన్ వేయడానికి అక్కడికి వచ్చాడు. అదే సమయంలో రివాల్వర్ దొంగిలించిన వ్యక్తి గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతుల్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నాటు తుపాకీతో పాటుగా రెండు బులెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇక, ఈ కేసుకు సంబంధించి అతుల్ పాట్నర్స్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరికి గురైన రివాల్వర్, బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Published by: Sumanth Kanukula
First published: November 23, 2020, 9:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading