విజయవాడ-హైదరాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

గొర్రెల మంద రోడ్డుకు ఒక్కసారిగా అడ్డురావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేకులు వేశారు.

news18-telugu
Updated: November 17, 2019, 12:42 PM IST
విజయవాడ-హైదరాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడ టు హైదరాబాద్ హైవేపై ... నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఒకదాని వెనుక ఒకటి వరుసగా వెళుతున్న నాలుగు కార్లు, ఒక లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో విజయవాడ- హైదరాబాద్ హైవే మీద మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

గాయపడ్డ వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. గొర్రెల మంద రోడ్డుకు ఒక్కసారిగా అడ్డురావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేకులు వేశారు. దీంతో దాని వెనుక వస్తున్న కార్లు బలంగా వచ్చి లారీని ఢీకొన్నట్లు తెలుస్తుంది. ప్రమాదానికి  సంబంధించిన మరిన్న వివరాల్ని పోలీసులు సేకరించే పనిలో పడ్డారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...