Home /News /crime /

ROAD ACCIDENT KILLS WOMAN IN EAST GODAVARI DISTRICT SSR

Accident: కోడలికి మగపిల్లాడు పుట్టాడన్న సంతోషంలో బంధువులకు భోజనాల కోసం సరుకులకు వెళ్లి తిరిగొస్తుండగా..

రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న లక్ష్మి

రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న లక్ష్మి

దుళ్ళ లక్ష్మి(35), ఆమె పెద్ద కొడుకు దుళ్ళ శేఖర్ రాజానగరం మార్కెట్‌కు వెళ్లారు. శేఖర్ భార్య పురుడు పోసుకుని మగబిడ్డతో బుధవారం ఇంటికి వస్తుండటంతో.. మనవడు ఇంటికి వస్తున్న ఆనందంలో బంధువులకు భోజనాలు పెట్టాలని దుళ్ళ లక్ష్మి భావించింది. కొడుకుతో కలిసి రాజానగరం మార్కెట్‌కు సరుకులు తీసుకురావడానికి బైక్‌పై వెళ్లింది.

ఇంకా చదవండి ...
    రంగంపేట: మనిషిని మృత్యువు ఎప్పుడు.. ఎక్కడ.. ఏ రూపంలో ముంచేస్తుందో తెలియదు. ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’ అని ఓ గేయ కవి చెప్పినట్టుగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన అప్పటివరకూ సంతోషంగా ఉన్న కుటుంబంలో విషాదం నింపింది. కోడలికి మగబిడ్డ పుట్టడంతో ఆ అత్త ఎంతో సంతోషించింది. మనవడు వస్తున్న ఆనందంలో బంధువులకు, ఇరుగుపొరుగు వారికి భోజనాలు ఏర్పాటు చేసింది. కొడుకుతో కలిసి సరుకులు తీసుకుని తిరిగొస్తుండగా ఆ నానమ్మ ప్రాణాలు దురదృష్టవశాత్తూ గాల్లో కలిసిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ముకుందాపురానికి చెందిన దుళ్ళ లక్ష్మి(35), ఆమె పెద్ద కొడుకు దుళ్ళ శేఖర్ రాజానగరం మార్కెట్‌కు వెళ్లారు. శేఖర్ భార్య పురుడు పోసుకుని మగబిడ్డతో బుధవారం ఇంటికి వస్తుండటంతో.. మనవడు ఇంటికి వస్తున్న ఆనందంలో బంధువులకు భోజనాలు పెట్టాలని దుళ్ళ లక్ష్మి భావించింది. కొడుకుతో కలిసి రాజానగరం మార్కెట్‌కు సరుకులు తీసుకురావడానికి బైక్‌పై వెళ్లింది. బియ్యం, కూరగాయలు.. కావాల్సిన సరుకులు అన్నీ తీసుకున్నారు. శేఖర్, అతని తల్లి లక్ష్మి కలిసి బైక్‌పై మళ్లీ సొంతూరికి బయల్దేరారు.

    వడిసలేరు నుంచి ముకుందవరం వెళ్లే జంక్షన్ దగ్గరకు రాగానే టాటా ఏస్ వ్యాన్ పెద్దాపురం వైపు నుంచి స్పీడ్‌గా వస్తూ శేఖర్ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనతో బైక్‌ వెనుక కూర్చున్న లక్ష్మి ఇటు పక్క నుంచి అటు పక్కకు ఎగిరిపడింది. అలా పడటంతో ఆమె తల రోడ్డుకు గుద్దుకుని బలంగా గాయమైంది. తీవ్ర రక్తస్రావమై స్పాట్‌లోనే చనిపోయింది. ఆమె కొడుకు శేఖర్‌కు కాలు విరిగి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంగంపేట ఎస్‌ఐ సుధాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Constable: భార్యాపిల్లలను అత్తారింట్లో వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చాడు.. ఇంతలోనే ఎంతపని చేశాడంటే...
    మనవడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఘనంగా బంధువులకు భోజనాలు ఏర్పాటు చేసి అందరినీ పిలుచుకోవాలని భావించిన లక్ష్మి రోడ్డు ప్రమాదం కారణంగా కానరాని లోకాలకు తరలిపోయింది. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపే ఈ ఘోరం జరగడం గమనార్హం. లక్ష్మి మృతితో ముకుందాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Accident, AP News, Bike accident, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు