Mothers Day: మదర్స్ డే సందర్భంగా తల్లితో కేక్ కట్ చేయించాలనుకున్నారు.. కానీ పాపం...

ప్రతీకాత్మక చిత్రం

ఆదివారం మదర్స్ డే సందర్భంగా వారి తల్లిదండ్రులతో కేక్‌ను కట్ చేయించాలని భావించి కేక్ తీసుకొచ్చేందుకు నరసరావుపేట పట్టణానికి బైక్‌పై బయల్దేరారు. దారి మధ్యలో కేసానుపల్లి దగ్గరలోకి వెళ్లగానే నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వెళుతున్న లారీ ఎదురుగా వెళుతున్న వీళ్ల బైక్‌ను ఢీ కొట్టింది.

  • Share this:
    గుంటూరు: మదర్స్‌డే సందర్భంగా తల్లితో కేక్ కట్ చేయించాలనున్నారు. కేక్ తీసుకొచ్చేందుకు టౌన్‌కు బయల్దేరారు. వెళ్లే దారిలో యాక్సిడెంట్ రూపంలో మృత్యువు ఆ ఇద్దరు యువకులను బలితీసుకుంది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం బసికాపురం గ్రామానికి చెందిన ఏసుబాబు(17), వెంకిబాబు(19) స్నేహితులు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా వారి తల్లిదండ్రులతో కేక్‌ను కట్ చేయించాలని భావించి కేక్ తీసుకొచ్చేందుకు నరసరావుపేట పట్టణానికి బైక్‌పై బయల్దేరారు. దారి మధ్యలో కేసానుపల్లి దగ్గరలోకి వెళ్లగానే నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వెళుతున్న లారీ ఎదురుగా వెళుతున్న వీళ్ల బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో.. బైక్‌పై నుంచి ఎగిరిపడిన ఈ ఇద్దరు యువకులకు తీవ్ర గాయలయ్యాయి. రోడ్డుకు బలంగా తగలడంతో రక్రస్రావమైంది. స్పాట్‌లోనే ఈ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో వెంకి, ఏసు చనిపోయారన్న విషయం తెలుసుకున్న బసికాపురం గ్రామస్తులు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వెళుతున్నారు. ఘటన గురించి తెలుసుకుని మధ్యలో ఆగి తన వాహనం దిగి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ యువకులు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో 108 కాల్ చేసినా అంబులెన్స్ సకాలంలో అందుబాటులోకి రాలేదు. దీంతో.. ఓ ప్రైవేట్ వాహనంలో ఆ యువకులను తరలించాలని ఎమ్మెల్యే పోలీసులకు సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంకిబాబు తండ్రి వెంకట్రావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లాలోనే జరిగిన మరో ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. మదర్స్ డే రోజునే తల్లిపై కత్తితో దాడి చేశాడో కసాయి కొడుకు. వినుకొండ మండలంలోని నీలగంగవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. బొగ్గూరి కాశమ్మ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కుమారుడు షణ్ముకరావుకు ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహమైంది.

    భార్యాభర్తల మధ్య పెళ్లయిన కొన్నాళ్లకు మనస్పర్థలు వచ్చాయి. భార్యతో విడాకులు ఇప్పించాలని అప్పటి నుంచి షణ్ముకరావు పట్టుబడుతున్నాడు. ఈ విషయంలో భార్యకు తల్లి వత్తాసు పలుకుతోందని.. తన భార్య విడాకులకు సిద్ధపడకుండా తల్లి అడ్డుపడుతోందని షణ్ముక రావు ఆమెతో ఆదివారం గొడవ పెట్టుకున్నాడు. కోపంలో కత్తితో ఆమెపై దాడి చేశాడు. స్థానికులు ఆమెను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published: