Home /News /crime /

ROAD ACCIDENT KILLS HOME GUARD IN SANGAREDDY DISTRICT SSR

Accident: భార్యను డ్యూటీలో దింపి బైక్‌పై ఇంటికెళుతున్నాడు.. పది నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపే..

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో శ్రవణ్‌కుమార్(ఫైల్ ఫొటో)

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో శ్రవణ్‌కుమార్(ఫైల్ ఫొటో)

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన డప్పు శ్రవణ్‌కుమార్(35) రామచంద్రాపూర్ విజిలెన్స్ సీఐ వద్ద డ్రైవర్‌గా విధుల్లో ఉన్నాడు. అతనికి భార్య నిర్మల, ఒక పాప, బాబు ఉన్నారు.

    సంగారెడ్డి: ఆయన హోం గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. భార్యను బైక్‌పై తీసుకెళ్లి హాస్పిటల్ వద్ద డ్రాప్ చేసి తిరిగొస్తున్నాడు. కానీ.. ఊహించని ఘటన ఆ హోం గార్డు జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భార్యాపిల్లలతో సంతోషంగా గడిపిన ఆ హోంగార్డును మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన డప్పు శ్రవణ్‌కుమార్(35) రామచంద్రాపూర్ విజిలెన్స్ సీఐ వద్ద డ్రైవర్‌గా విధుల్లో ఉన్నాడు. అతనికి భార్య నిర్మల, ఒక పాప, బాబు ఉన్నారు. శ్రవణ్‌కుమార్ భార్య నిర్మల సన్‌షైన్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాన్ని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. భార్య నిర్మలను హాస్పిటల్ దగ్గర దింపి వచ్చేందుకు మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో బైక్‌పై శ్రవణ్‌కుమార్ ఇంటి నుంచి బయల్దేరాడు. ఇద్దరూ కలిసి ఆమాటా, ఈమాటా చెప్పుకుంటూ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. పిల్లలను ఇంట్లోనే ఉండమని, వెంటనే వస్తానని చెప్పిన శ్రవణ్ భార్యను డ్యూటీలో దింపి బైక్‌పై తిరిగొస్తుండగా దారి మధ్యలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా దగ్గర ఓ వాహనం అతివేగంగా వచ్చి వెనుక నుంచి శ్రవణ్ బైక్‌ను ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళుతున్న లారీ శ్రవణ్ బైక్‌ను ఢీ కొట్టడంతో శ్రవణ్ బైక్‌తో సహా లారీ చక్రాల కింద పడ్డాడు.

    లారీ టైర్లు మీద నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలైన శ్రవణ్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్ విజయ్‌పై కేసు నమోదు చేశారు. శ్రవణ్ చనిపోయిన విషయం తెలిసి అతని భార్య నిర్మల షాక్‌కు లోనైంది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపే ఇలా జరగడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తండ్రి ఇంటికి వస్తాడని ఎదురుచూసిన అతని కొడుకు నిషిబాబు, కూతురు జస్సీ నాన్న చనిపోయాడని తెలిసి భోరున విలపించారు.

    ఇది కూడా చదవండి: Bike Accident: 75 ఏళ్ల వయసులో కరోనాను జయించాడు.. నెగిటివ్ వచ్చిన రెండు రోజులకు కూరగాయలకు వెళుతుండగా..

    యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడటం కాదని, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం అని ఓ సినిమాలో చెప్పినట్టుగా పాపం రోడ్డు ప్రమాదంలో శ్రవణ్‌కుమార్ చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిన పరిస్థితి. రోడ్డుపై ఎంత జాగ్రత్తగా వెళుతున్నా ఎదుటి వారి నిర్లక్ష్యం, అతి వేగం ఇతరుల ప్రాణాలను ఇలా బలితీసుకుంటున్నాయి. ఆ కుటుంబాలకు కన్నీటిని మిగుల్చుతున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bike accident, Crime news, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు