Road Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎటవా జిల్లాలో... ఎదురెదురుగా వచ్చిన ట్రక్ , కారు ఢీకొన్నాయి. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలోనే ఐదుగురు చనిపోయారు. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
యూపీలో (Uttar Pradesh) దారుణం జరిగింది. రెండు వాహనాలు జాతీయ రహదారిపై బీభత్సాన్ని సృష్టించాయి. బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వచ్చిన ట్రక్, కారు బలంగా (Road accident) ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇరు వాహనాలలో ఉన్న వారిలో మొత్తం ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు.
మరో ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నాగ్లా రాథోర్ గ్రామం పరిధిలో జరిగింది. సంఘటన జరగగానే స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. వాహనాలలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలను చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. స్పాట్ లోనే ఐదుగురు విగత జీవులుగా ఉండటాన్నిగమనించారు. వీరిని మార్చురీకి తరలించారు.
వాహనాలు నడుపుతున్న వారు.. మద్యం స్వీకరించారా లేదా నిద్ర మత్తులో అదుపు తప్పరా.. అన్న కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్ (Traffic On Road) ను క్లియర్ చేశారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురిని కూడా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Road accident, Uttar pradesh