Road Accident: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మైనర్ యువకుడు వాహనాన్ని అజాగ్రత్తగా ట్రక్ ను నడిపి మరో వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తొమ్మది మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్సాస్ కి (Texas Road Accident) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 13 ఏళ్ల మైనర్ బాలుడు ట్రక్ ను నడిపాడు. అతను తన తండ్రితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎదురుగా వ్యాన్ వచ్చింది. అతను తన వాహనాన్ని అదుపు చేయలేక పోయాడు.
కొందరు గోల్ఫ్ జట్టుతో ప్రయాణిస్తున్న ఒక వ్యాన్ ను ఢీకొట్టాడు. దీంతో తొమ్మిది మంది సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతి చెందిన వారంతా న్యూ మెక్సికో లోని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ వెస్ట్ గోల్ప్ జట్టులోని ఆరుగురు సభ్యులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ఒక దాని కోకటి బలంగా ఢీకొన్నాయి. వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
వాహనాన్ని నడుపుతున్న మైనర్ బాలుడు, అతని తండ్రి కూడా సంఘటన స్థలంలోనే చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనం వేగంగా తనకు ఎదురుగా వస్తున్న మరో వాహనంకు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగగానే మైనర్ బాలుడు ట్రక్ కింద చిక్కుకున్నాడని తెలిపారు. మరో ఇద్దరు యూనివర్శిటీ ఆఫ్ సౌత్వెస్ట్ విద్యార్థులు, ఇద్దరు కెనడియన్ల పరిస్థితి విషమంగా ఉంది.
వీరిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. టెక్సాస్ చట్టాల ప్రకారం.. 21 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు వాహనాలు నడపరాదు. రెండు వాహనాలు మితిమిరిన వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని అన్నారు. వాహనాలు ఢీకొనగానే.. ట్రక్ టైర్ ఊడిపోయి దూరంగా పడిపోయిందని పోలీసులు తెలిపారు.
మృతి చెందిన వారిని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అక్కడి సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.