ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే 10 మంది దుర్మరణం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

ప్రతీకాత్మక చిత్రం

Road Accident in Tamilnadu: లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి 11 లారీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరి కొంత మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదకరంలో దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి.

 • Share this:
  రోజు రోజుకూ రోడ్డు ప్రమాదలు పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట రోడ్లు రక్తమయమవుతున్నాయి. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి 11 లారీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరి కొంత మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదకరంలో దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి పోయాయి. వివరాల ప్రకారం..తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లా తోళూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సెలం-బెంగుళూరు హైవే పై వెళ్తున్న లారీకి బ్రెకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపుతప్పిన లారీ దాని ముందు వెళ్తున్న 11 కార్లపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

  ఈ ఘోర ప్రమాదం కారణంగా రెండు గంటలుగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు ముమ్మరంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. రక్తపు దారలు, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, నుజ్జునుజ్జైన కార్లతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది. ప్రమాదంతో 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రిస్క్యూ టీం, అధికారులు పోలీసులు మృతదేహాలను ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడంతో పాటు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  ఇటీవల రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీపై పడ్డాయి. ఈ ఘటనలో స్కూల్ టీచర్ మరణిచింది. భాంస్వారా జిల్లా బాగిదౌరా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగిదౌరాకు చెందిన నీలం పాటిదార్ అనే మహిళ.. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం తన ఇంటి నుంచి స్కూటీపై నౌగామాకు బయలుదేరారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి.. స్కూటీపై పడ్డాయి. అది 11 కేవీ విద్యుత్ లైన్ కావడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి.

  రోడ్డుపై అందరూ చూస్తుండగానే క్షణాల్లో బండి తగలబడిపోయింది. టీచర్ నీలం కూడా సజీవ దహనమయ్యారు. ఈ ఘటన జరగడానికి కాసేపటికి ముందే ఆ ప్రాంతంలో వర్షం పడడంతో రోడ్డంతా తడిగా ఉంది. అందుకే తమకూ షాక్ తగులుతుందనే భయంతో.. ఎవరూ ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అలా క్షణాల్లోనే స్కూటీ కాలి బూడిదయింది. టీచర్ కూడా దహనమయ్యారు. అందరి కళ్ల ముందే హాహా కారాలు చేస్తూ కన్నుమూశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కంటతడి పెట్టింది. అదే సమయంలో భయాందోళనకు గురిచేసింది.
  Published by:Nikhil Kumar S
  First published: