హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road Accident: పండుగ పూట పెను విషాదం.. ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తీవ్రంగా..

Road Accident: పండుగ పూట పెను విషాదం.. ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తీవ్రంగా..

కారు ప్రమాదం

కారు ప్రమాదం

Road accident: దేశ రాజధాని ఢిల్లీలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

Road accident in Delhi: న్యూఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం.. బాబ బండా సింగ్ బహదూర్ సేతు ప్రాంతంలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను (Road accident) ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంస మయ్యాయి. కారులో ఒక మహిళ,బాలుడు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అదే విధంగా ఆటోలో నలుగురు ప్రయాణికులు(Passengers Injured) ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల యువకుడు స్పాట్ లోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరీశీలిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత, అంబులెన్స్ లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు , స్థానికులు సహకారంతో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.


కారు ప్రమాదానికి మితిమీరిన వేగం కారణామా లేదా డ్రైవర్ ఎవరైన మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తప్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్పించకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరు చనిపోలేదని పోలీసులు తెలిపారు. గాయపడిన వారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఇలాంటి  రోడ్డు ప్రమాదం నిన్న హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగింది.

Road accident in jubilee hills: హైదరాబాద్ లో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వచ్చిన కారు జూబ్లీహీల్స్ (Jubilee Hills) లో బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డు నంబర్ 45 లో ఒక మహిళ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టింది. తల్లి చేతిలో ఉన్న రెండేల్ల బాలుడు ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడ్డాడు. వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ కారును వదిలి అక్కడే వదిలి పారిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల బాలుడు చనిపోవడంలో అక్కడ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. (Road Accident) రెండేళ్ల కన్న కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో.. ఆ తల్లిని ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు. కారుకి బోధన్ ఎమ్మెల్యే షకిల్ (Mla shakeel Sticker on car) పేరుతో ఉన్న స్టికర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

First published:

Tags: New Delhi, Road accident

ఉత్తమ కథలు