కర్నూలులో రోడ్డు ప్రమాదం.. రెండు లారీలను ఢీకొన్న తెలంగాణ గరుడ బస్సు

ఈఘటనలో తొమ్మిదిమంది గాయాలపాలయ్యారు. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

news18-telugu
Updated: June 1, 2019, 7:48 AM IST
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. రెండు లారీలను ఢీకొన్న తెలంగాణ గరుడ బస్సు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసికి చెందిన గరుడ బస్సు ప్రమాదానికి గురైంది. కంబాలపాడు సర్కిల్ వద్ద రెండు లారీలను గరుడ బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో తొమ్మిదిమంది గాయాలపాలయ్యారు. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులందరినీ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి డోన్‌ హైవేపై స్పీడ్‌ బ్రేకర్ల వద్ద నెమ్మదిగా వెళ్తున్న లారీలను వెనుకవైపు నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని డీఎస్పీ ఖాదర్‌ బాషా పరిశీలించారు.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...