Road accident in jubilee hills: హైదరాబాద్ లో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వచ్చిన కారు జూబ్లీహీల్స్ (Jubilee Hills) లో బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డు నంబర్ 45 లో ఒక మహిళ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టింది. తల్లి చేతిలో ఉన్న రెండేల్ల బాలుడు ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడ్డాడు. వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ కారును వదిలి అక్కడే వదిలి పారిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల బాలుడు చనిపోవడంలో అక్కడ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. (Road Accident) రెండేళ్ల కన్న కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో.. ఆ తల్లిని ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు. కారుకి బోధన్ ఎమ్మెల్యే షకిల్ (Mla shakeel Sticker on car) పేరుతో ఉన్న స్టికర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది ఆయనకు చెందిన వాహనమా.. లేదా ఆయన అనుచరులేవరైనా ఆయన కారును ఉపయోగించారా.. అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతరులేవరైన ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ పేట్టుకుని తిరుగుతున్నారా.. అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. డ్రైవర్ అతి వేగంతో (Heavy speed) వలన ప్రమాదం జరిగిందా, మద్యం మత్తులో (Drunker) కారు ప్రమాదం జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనతో మహిళ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలం చుట్టు పక్కల ఉన్న సీసీఫుటేజీ ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Road accident, Telangana crime news, Telangana News