Home /News /crime /

ROAD ACCIDENT IN GUNTUR TWO DIED NS

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Gutur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు లారీని ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడక్కడే దుర్మరణం చెందారు. యమపాశం లాగా దూసుకొచ్చిన లారీ ఇద్దరి యువకుల ప్రాణాలు తీసింది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన షేక్ బాచి(38), షేక్. చందాని(36), సందీప్ శనివారం ఉదయం వినుకొండ నుంచి గుంటూరుకు షిఫ్ట్ డిజైర్ కారులో బయలుదేరారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

    కనమర్లపూడి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి కారును ఢీ కొంది. ప్రమాదంలో బాచి, చందాని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సందీప్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే ఊరికి చెందిన ఇద్దరు ప్రమాదంలో చనిపోవడంతో నల్లపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామం శోక సంద్రమైంది. బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhrapradesh, Crime, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు