news18-telugu
Updated: December 2, 2020, 9:03 AM IST
ప్రతీకాత్మక చిత్రం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై సికింద్రాబాద్ నుంచి మహబూబ్నగర్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. చేవెళ్ల మండలం కందవాడ-మల్కాపూర్ శివారులోని మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బోర్వెల్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులు సికింద్రాబాద్లోని తాడ్బండ్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం పది మంది ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Nikhil Kumar S
First published:
December 2, 2020, 8:47 AM IST