హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, మరో పదిమందికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం..

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, మరో పదిమందికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎస్‌యూవీని ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

Road accident in Maharashtra at bedd district: మహారాష్ట్రలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బీడ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. లాతూర్-అంబజోగై హైవేపై .. అంబజోగై పట్టణానికి సమీపంలోని నంద్‌గావ్ ఫాటా వద్ద ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. రెండు వాహానాలు బలంగా ఢీకొనడం వలన ఇరు వాహానాల్లో ప్రయాణిస్తు వారు ఎగిరికిందపడ్డారు. దీంతో అక్కడ రోడ్డంతా భీతావాహాకంగా మారిపోయింది. రోడ్డంతా తెగిపడిన శరీర భాగాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులతో, ఆ ప్రాంతంలో రక్తపు మరకలతో భయంకరంగా మారిపోయింది. ఘటన జరగ్గానే స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు చేరుకుని వాహానాల మధ్యన చిక్కుకుని ఉన్నమృతదేహలను బయటకు తీశారు. ఘటన స్థలంలోనే ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, బాధితులు.. లాతూర్ జిల్లాలోని సాయి , అర్వి గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బీడ్‌లోని అంబజోగై తహసీల్‌లోని రాడికి ఒక కార్యక్రమం కోసం వెళుతుండగా, నందగోపాల్ డెయిరీ సమీపంలో వారి క్రూజర్ జీప్‌ను ట్రక్కు ఢీకొట్టిందని పోలీసు అధికారి తెలిపారు.

మృతులను నిర్మలా సోమవంశీ (38), స్వాతి బోడ్కే (35), శకుంతల సోమవంశీ (38), సోజర్‌బాయి కదం (37), చిత్ర షిండే (35), ఖండూ రోహిలే (35, డ్రైవర్) మరియు తొమ్మిదేళ్ల బాలుడుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే, సీనియర్‌ పోలీసు అధికారులు ఆసుపత్రిని సందర్శించారు. ప్రస్తుతం ఈ ఘటనలో బాధిత బంధువుల రోదనలతో ఆ ప్రాంత మంతా తీవ్ర విషాదకరంగా మారింది.

First published:

Tags: Maharashtra, Road accident

ఉత్తమ కథలు