Home /News /crime /

ROAD ACCIDENT CAR FALLS INTO WELL SIX PEOPLE DIED IN MADHYA PRADESH CHHATARPUR SU

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు, ఆరుగురు జల సమాధి

Image-ANI

Image-ANI

మధ్యప్రదేశ్‌‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.

  మధ్యప్రదేశ్‌‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జలసమాధి అయ్యారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలోని రాగోలి గ్రామంలో సోమవారం మధ్యహ్నం జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన తొమ్మిది మంది కారులో తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే వారు మహారజాపూర్‌కు చేరుకున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కారులో గాయాలతో ఉన్న మరో ముగ్గురిని బయటకు తీశారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్రేన్ సాయంతో కారును బావిలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టమ్‌కు తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.


  ఈ ఘటనపై మహారాజ్‌పైర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ జేవై ఖాన్ మాట్లాడుతూ.. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కారు గత రాత్రి ప్రమాదానికి గురైందని చెప్పారు. ఆరుగురు చనిపోయినట్టు వెల్లడించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి విచారణజరుపుతున్నట్టు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Madhya pradesh, Road Accident

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు