news18-telugu
Updated: November 4, 2020, 8:16 AM IST
ప్రతీకాత్మక చిత్రం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం వద్ద మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. రోడ్డు పక్కన బైక్ ఆపి స్వెట్టర్ వేసుకుంటుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కుమారుడు షేక్ ఫారుఖ్(22) తన ఫ్రెండ్ ఫయాజ్ తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్ కు బైక్ పై వెళ్తున్నాడు. అయితే బాగా చలి వేస్తోందని ధర్మోజిగూడెం వద్దకు రాగానే రోడ్డు పక్కకు బైక్ ఆపారు.
ఈ క్రమంలో షారుఖ్ స్వెట్టర్ వేసుకుంటుండగా హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు వీరిని ఢీ కొట్టింది. ప్రమాదంలో షారుఖ్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మిత్రుడు ఫయాజ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగా ప్రయాదం నుంచి బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షారుఖ్ మృతదేహాన్ని పోస్టుమార్తం కోసం చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మస్తాన్ వలికి ఏకైక కుమారుడు ఫారుక్. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో మస్తాన్ వలీ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Published by:
Nikhil Kumar S
First published:
November 4, 2020, 7:48 AM IST