Road Accident: రోడ్డు ప్రమాదాలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నిదానమే ప్రధానం అన్నది గుర్తుంచుకుంటే చాలా ప్రమాదాలు జరగనే జరగవు. త్వరగా గమ్యానికి వెళ్లిపోవాలనే మన ఆలోచనలే... ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఒక్క క్షణంలో జరిగే ఈ ప్రమాదాలే ప్రాణాలు తీసేస్తున్నాయి. అంతా అయిపోయాక... అయ్యో... నెమ్మదిగా వెళ్లి ఉంటే ఇలా జరిగేది కాదే అని అనుకున్నా ప్రయోజనం ఏముంటుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆ గాయాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలాగే... ప్రమాదం చేసిన వారిని కూడా ఆ తప్పిదం మనసులో చెరగని గాయాన్ని కలిగిస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఆ దంపతుల పాలిట శాపంగా మారింది.
మహారాష్ట్ర... సతారాలోని... వాయి-పాచ్వాడ్ రోడ్డులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 4 నెలల గర్భిణీ, ఆమె భర్త గాయాలతో... ఆస్పత్రిపాలయ్యారు. కారు డ్రైవర్ ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా... ఈ ప్రమాదం జరిగేదే కాదని వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇందులో ఓ కారు వెనక మరో కారులో వెళ్తున్న ఫ్యామిలీ... వీడియో తీస్తూ ఉంది. ఎదురుగా పాచ్వాడ్ వెళ్తున్న కారు... వాయి వైపు వస్తున్న టూవీలర్‌ను బలంగా ఢీకొట్టింది. అంతే... ఆ టూవీలర్‌పై వెళ్తున్న దంపతులు ప్రవీణ్, వనిత... గాల్లోకి ఎగిరి పడ్డారు. వనిత నాలుగు నెలల గర్భిణీ. ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. వీడియో చూడండి.
కారు నడిపిన డ్రైవర్ రాజేంద్ర రామచంద్ర రసాల్‌పై కేసు నమోదైంది. గాయపడిన దంపతులను సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. కారు డ్రైవింగ్ ఎంత మజా ఇస్తుందో, అంత ప్రమాదం కూడా. ముఖ్యంగా ఏక్సిలరేటర్‌ను చాలా జాగ్రత్తగా నడపాలి. ఏమాత్రం ఎక్కువగా ప్రెస్ చేసినా... కారు దూసుకుపోతుంది. ఆ తర్వాత కంట్రోల్ చెయ్యడం కష్టం. చాలా రోడ్డు ప్రమాదాలు ఇలాగే జరుగుతున్నాయి.
ఇది కూడా చూడండి:Horoscope Today: జనవరి 5 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి బాగా కలిసొచ్చే కాలం
విషాదకరమైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు... ఆశ్చర్యపోతూ మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అరెరే... ఆ కారు... అలా వెళ్లకపోయి ఉంటే బాగుండేదే అనుకుంటున్నారు. ఇకపై తాము ఎక్కడికి వెళ్లినా... ఓ పావు గంట ఆలస్యమైనా పర్వాలేదు గానీ... వేగంగా వెళ్లకూడదు అని బలంగా అనుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, VIRAL NEWS, Viral Videos