అవ్వా... బూతులు తిడుతూ స్థానికుడ్ని కొట్టిన ఆర్జేడీ ఎమ్మెల్యే

ఈ ఘటనలో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. స్థానికుడిపై ఎమ్మెల్యే దాడి చేసిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

news18-telugu
Updated: January 13, 2019, 8:50 AM IST
అవ్వా... బూతులు తిడుతూ స్థానికుడ్ని కొట్టిన ఆర్జేడీ ఎమ్మెల్యే
స్థానికుడ్ని కొడుతున్న ఆర్జేడీ ఎమ్మెల్యే (ట్విట్టర్)
news18-telugu
Updated: January 13, 2019, 8:50 AM IST
ఈ మధ్య ప్రజా ప్రతినిధులు రెచ్చిపోతున్నారు. విజ్ఞత కొల్పోయి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. గ్యాంగ్ లీడర్లలా.... గల్లీ రౌడీల్లా జులుం ప్రదర్శిస్తున్నారు. బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే ఇలాంటి తీరుతోనే ఇప్పుడు విమర్శలు పాలు అయ్యారు. తాను ఎమ్మెల్యేను కాబట్టి... ఏం చేసినా చెల్లుతుందంటూ రెచ్చిపోయారు. అధికార బలంతో రెచ్చిపోయి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఓ భూవివాదానికి సంబంధించి స్థానికుడిపై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే ప్రహ్లాద్ యాదవ్. ఈ ఘటనతో ఎమ్మెల్యే తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం మరి అలా జనంపై దాడులకు దిగుతారా అంటూ తప్పు పడుతున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. స్థానికుడిపై ఎమ్మెల్యే దాడి చేసిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

వివారాల్లోకి వెళ్తే... బిహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లా సత్యాగ్రహలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కొందరు పని చేసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఎమ్మెల్యే ప్రహ్లాద్ యాదవ్, కొందరు పోలీసులు వచ్చారు. ఓ స్థానికుడితో భూమి విషయమై ఎమ్మెల్యే గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో స్థానికుడిపై అసభ్య పదజాలంలో దూషణలకు దిగారు ఎమ్మెల్యే ప్రహ్లాద్ యాదవ్. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తిపై దాడికి దిగుతూ చెంప చెల్లుమనిపించారు. స్థానికుడ్ని హెచ్చిరస్తూ అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు.

దీంతో బాధితుడు పొలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, ఘటనకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్యే దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇవికూడా చదవండి :కొత్త నాణేలు వచ్చేస్తున్నాయ్... 16న నమూనాల ఖరారు

యూనివర్శిటీలో గ్యాంగ్ రేప్, కర్ణాటకలో దుమారం... ఇద్దరు అరెస్టు

ఫ్రెండ్‌ని పెళ్లాడేందుకు లింగమార్పిడి...అబ్బాయిగా మారిన అమ్మాయి కన్నీటి కథ
Loading...

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...