హోమ్ /వార్తలు /క్రైమ్ /

Father's Day 2020: చనిపోయిన కూతురి కోసం 5 ఏళ్లుగా తండ్రి న్యాయ పోరాటం

Father's Day 2020: చనిపోయిన కూతురి కోసం 5 ఏళ్లుగా తండ్రి న్యాయ పోరాటం

రిషితేశ్వరి(ఫైల్ ఫోటో)

రిషితేశ్వరి(ఫైల్ ఫోటో)

ఓ సాధారణ తండ్రి పోరాటం వల్ల మేలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చనిపోయే సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినప్పటికీ.. ఆమె మీద వేధింపులు జరిగిప్పుడు మైనర్ అయినంందున నిందితుల మీద పోక్సో చట్టం కింద విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇంకా చదవండి ...

చనిపోయిన కూతురికి న్యాయం జరిగేందుకు ఓ తండ్రి ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నాడు. ఇలాంటివి ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజజీవితంలో ఇలాంటి కేసులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాడు. కేసు విచారణకు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరిస్తే.. దాని హైకోర్టులో సవాల్ చేసి విజయం సాధించాడు. ఓ సాధారణ తండ్రి పోరాటం వల్ల మేలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చనిపోయే సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినప్పటికీ.. ఆమె మీద వేధింపులు జరిగిప్పుడు మైనర్ అయినంందున నిందితుల మీద పోక్సో చట్టం కింద విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. చార్జిషీట్‌ను తిప్పి పంపుతూ, సంబంధిత కోర్టులో దాఖలు చేసుకోవాలని పోక్సో కోర్టు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది. చార్జిషీట్‌ను తిరిగి స్వీకరించి, సంబంధిత సాక్ష్యాధారాల ఆధారంగా కేసును ఆరు నెలల్లోగా తేల్చాలని న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు

రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణను ప్రత్యేక పోక్సో న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినందున ఈ కేసును తాము విచారించలేమని స్పష్టం చేసింది. మైనర్లపై చోటు చేసుకునే అత్యాచార కేసులను విచారించడానికి పోక్సో న్యాయస్థానం ఏర్పాటయిందని.. రిషితేశ్వరి కేసును తాము విచారించలేమని తెలిపింది. ఆత్మహత్య చేసుకునే సమయానికి రిషితేశ్వరి మేజర్ అని, ఈ కేసు విచారణ తమ పరిధిలోకి రాదని, సంబంధిత న్యాయస్థానంలో దాఖలు చేసుకోవాలని పిటీషనర్లకు సూచించింది. పోలీసుల దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను తిప్పి పంపించింది. దీనిపై రిషితేశ్వరి తండ్రి హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆమె చనిపోయిన తేదని ప్రాదిపకదిగా తీసుకోవద్దని, బాధితురాలిపై లైంగిక వేధింపులు జరిగిన తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటికి ఆమె మైనర్ అయినందున.. పోక్సో న్యాయస్థానమే విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా, వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఆత్మహత్య చేసుకుంది. 2015 జులై 14వ తేదీన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీనియర్ల ర్యాగింగ్, లైంగికంగా వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఛార్జిషీట్‌లో నమోదు చేశారు. ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాబూరావు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అప్పట్లో రాజకీయ దుమారం చెలరేగింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిందితులను కాపాడుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ ఐదేళ్లు కావొస్తున్నా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, కూతురికి న్యాయం చేసేందుకు ఆమె తండ్రి పోరాటం చేస్

First published:

Tags: Crime news, Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day

ఉత్తమ కథలు