Video: రోడ్డుపై మెరిసే కత్తితో దాడి... యువకుడి హత్యతో హడలెత్తిన ప్రజలు... లైవ్ వీడియో

రోడ్డుపై మెరిసే కత్తితో దాడి (image credit - twitter)

Viral Video: అప్పటిదాకా ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా కలకలం. ఇలా హత్య చేస్తారనీ... మెరిసే కత్తితో దాడి చేస్తారని ఎవరు ఊహిస్తారు. అసలు ఎందుకిలా చేశారో తెలుసుకుందాం.

  • Share this:
    అది పుణెలోని పింప్రీ-చింద్వాడ రోడ్డు. చిఖాలీ ఏరియా. ప్రశాంతంగా ఉంది. ఇద్దరు యువకులు రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్నారు. వారితో ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. రోడ్డుపై మరీ ఎక్కువ మంది ప్రజలు లేకపోయినా... కొద్ది మంది మాత్రం అటూ ఇటూ తిరుగుతున్నారు. అలాంటి సమయంలో జరిగిన ఓ హత్య స్థానికంగా హడలెత్తించింది. హంతకుడు... ఉరుకులు పరుగులు పెట్టి మరీ హత్య చెయ్యడం... తీవ్ర కలకలం రేపింది. ఆదివారం జరిగిన ఈ హత్యకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మారింది. కనిఫ్ నాథ్ క్షీరసాగర్... మరో కుర్రాడితో మాట్లాడుతూ ఉండగా... అతని ప్రత్యర్థి అయిన ఆకాష్... రోడ్డుపై ఓ సంచి పట్టుకొని నడుస్తూ వెళ్లసాగాడు. క్షీరసాగర్‌ని దాటి నాలుగు అడుగులు వేసిన ఆకాష్... ఆగాడు.

    తన సంచిలోంచి మెరిసే పెద్ద కత్తిని బయటకు తీసిన ఆకాష్... క్షీరసాగర్‌పై వెనక నుంచి దాడి చేశాడు. వేటు వేశాడు. అంతే... మరో యువకుడు, పిల్లాడు... అక్కడి నుంచి పారిపోయారు. వేటు నుంచి కొద్దిపాటి గాయంతో తప్పించుకున్న సాగర్... ప్రాణభయంతో పరుగులు పెట్టాడు. ఎలాగైనా సాగర్‌ని చంపాల్సిందే అని ఫిక్స్ అయిన ఆకాష్... వెనకాలే పరుగెడుతూ వెళ్లి... వరుసగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో క్షీరసాగర్ చనిపోయాడు. పోలీసులు... ఆకాష్‌ని అరెస్టు చేశారు.

    దాడి వీడియోను ఇక్కడ చూడండి.


    అసలేంటి సమస్య:
    క్షీరసాగర్, ఆకాష్... పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. ఓ రోజు కొంతమంది యువకులు... ఆకాష్‌ను చచ్చేంతలా కొట్టారు. ఆ దాడి నుంచి ఆకాష్ కోలుకున్నాడు. దీనికి కారణం క్షీరసాగరే అని భావించాడు. ఇల్లు ఖాళీ చేసి... మరో ప్రదేశానికి వెళ్లిపోయాడు. కానీ సాగర్‌పై పగను పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని చంపేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. దాని ఫలితమే ఆదివారం హత్య.

    ఇది కూడా చదవండి: KFC చికెన్ తింటుంటే షాక్... విదేశీయులకు చుక్కలు చూపిస్తున్న సీగల్ పక్షులు... VIDEO

    ఆదివారం మధ్యాహ్నం 1.30 సమయంలో ఈ హత్య జరిగింది. ఇప్పుడు సాగర్ కొడుకు... తండ్రిలేని వాడయ్యాడు. దీనిపై పోలీసులు కొత్త విషయం చెప్పారు. సాగర్ వెంటపడి కత్తితో దాడి చేసిన ఆకాష్... ఆ దాడిలో కిందపడిన సాగర్‌ తలపై బండరాయితో కొట్టి చంపాడని తెలిపారు. ఇలా కత్తి, బండరాయితో ఈ హత్య చేసినట్లు వివరించారు. సీసీఫుటేజ్‌లో మాత్రం కత్తితో దాడి చేసిన దృశ్యమే రికార్డ్ అయ్యింది.
    Published by:Krishna Kumar N
    First published: