కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం... అడ్డంగా మోసపోయిన మహిళ...

రూ.4.7 కోట్ల కోసం ఆశపడిన ఆమె... ఎలాంటి ఉచ్చులో చిక్కుకుంది? ఈ మోసం ఎలా జరిగింది?

news18-telugu
Updated: July 12, 2020, 11:43 AM IST
కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం... అడ్డంగా మోసపోయిన మహిళ...
కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం... అడ్డంగా మోసపోయిన మహిళ...
  • Share this:
ఆమె వయసు 69 ఏళ్లు. ముంబైలోని వసాయ్‌లో ఉంటున్న రిటైర్డ్ టీచర్. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టంలేని ఆమె... ఇన్సూరెన్స్ పాలసీలు చేయించే ఏజెంట్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇలాంటి సమయంలో... మే 18న లియో జాకోబ్... ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపాడు. ఓకే చేసింది. తనను స్కాట్‌లాండ్‌లో పైలట్‌గా చెప్పుకున్నాడు. నమ్మేసింది. పరిచయం పెరిగింది. ఇద్దరూ వాట్సాప్ నంబర్లు ఇచ్చుకున్నారు. చాటింగ్ మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాయి. ఆమెకు బాగా నమ్మకం కలిగేందుకు... ఇండియాలో తాను స్థలాన్ని కొనబోతున్నట్లు లియో చెప్పాడు. అందుకోసం డబ్బు పంపుతాననీ... తన బదులుగా... ఆమెను భూమి కొని పెట్టమని కోరాడు. ఆమె సరే అంది.

ఒక రోజు తర్వాత. తాను ఓ పార్సిల్‌లో డబ్బను ఎయిర్ కొరియర్ ద్వారా పంపానని ఆమెకు చెప్పాడు. అలాగే... అందులో పువ్వులు, ఓ వాచ్ కూడా గిఫ్టుగా పంపానని తెలిపాడు. ఆ గిఫ్టు పార్శిల్‌ను ఎయిర్‌పోర్టుకి వెళ్లి తీసుకోమని కోరాడు. ఆమె సాయంత్రం వెళ్తానని చెప్పింది.

కాసేపటి తర్వాత... జోషిలా అనే పేరుతో ఓ అమ్మాయి... ఈ టీచర్‌కి కాల్ చేసింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో తాను ఉద్యోగిని అని చెప్పుకుంది. టీచర్ నిజమేనని నమ్మింది. "మీ కోసం స్కాట్లాండ్ నుంచి ఓ ప్యాకేజీ వచ్చింది. ఇందులో మొత్తం రూ.4.7 కోట్లు ఉన్నాయి. ఈ పార్శిల్ మీకు ఇవ్వాలంటే... మీరు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి అంది. ఎంత చెల్లించాలి అంటే... రూ.58 లక్షలు అని చెప్పింది. అదేంటి... అంటూ... ఆ మహిళ... వెంటనే... కాల్ కట్ చేసి... లియోకి కాల్ చేసింది. లియో కూడా అవునన్నాడు. తాను పంపిన డబ్బుకి... కస్టమ్స్ డ్యూటీ చెల్లిస్తేనే... ఇస్తారనీ, లేదంటే ఇవ్వరని చెప్పాడు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించి... ఆ మొత్తాన్నీ తాను పంపిన మనీ నుంచి వెనక్కి తీసుకోమని సలహా ఇచ్చాడు. సరే అంది.

మరోసారి ఆ ఎయిర్‌పోర్ట్ అమ్మాయికి కాల్ చేసి... డబ్బు ఎలా చెల్లించాలి అని అడిగింది. నేను మీ మొబైల్‌కి ఓ లింక్ పంపుతాను. అది క్లిక్ చేసి... అందులో అకౌంట్ నంబర్‌కి మనీ పంపండి అని చెప్పింది. ఆ పెద్దావిడ సరే అంది. చెప్పినట్లుగానే రూ.58 లక్షలు చెల్లించింది. సాయంత్రం ఎయిర్‌పోర్టుకి వెళ్లింది. పార్శిల్ అడిగింది. అక్కడి అధికారులు... ఏ పార్శిలూ రాలేదని చెప్పారు. షాకైన ఆమె... లియో, జోషిలా ఇద్దరికీ కాల్ చేసింది. రెండు మొబైళ్లూ స్విచ్ఛాఫ్ అని వచ్చాడు. వాట్సాప్ చాటింగ్ కూడా బ్లాక్ అయ్యింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన పెద్దావిడ... హడావుడిగా పోలీసుల్ని కలిసి... కంప్లైంట్ ఇచ్చారు.

పోలీసులు IP ఎడ్రెస్‌లు, కాల్స్, చాటింగ్ ఆధారంగా... ఇదంతా... నైజీరియా ముఠాలు ఆడిన డ్రామా అని తేల్చారు. త్వరలోనే వాళ్లను పట్టుకుంటామని చెప్పారు. కానీ చాలా కేసుల్లో నైజీరియా ముఠాలు దొరకట్లేదు.
Published by: Krishna Kumar N
First published: July 12, 2020, 11:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading