Home /News /crime /

Telangana: రైల్వేలో ఉద్యోగాలంటూ వల.. రూ. కోట్లు కాజేసిన రిటైర్డ్ ఎస్ఐ .. ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకున్నాడంటే..

Telangana: రైల్వేలో ఉద్యోగాలంటూ వల.. రూ. కోట్లు కాజేసిన రిటైర్డ్ ఎస్ఐ .. ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకున్నాడంటే..

రిటైర్డ్ ఎస్ఐ రాజమౌళి

రిటైర్డ్ ఎస్ఐ రాజమౌళి

రక్షక బటుడు నిరుద్యోగుల పాలిట భక్షక భటుడిగా మారాడు. రైల్వేలో ఉద్యోగాలంటూ వల వేశాడు. నమ్మిన నిరుద్యోగులు కోట్ల రూపాయలను అప్పనంగా ఇచ్చేశారు. చివరకు మోసపోయామని గ్రహించి హెచ్ ఆర్సీని ఆశ్రయించారు.

    ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు... అందరికీ ఇష్టమే కాకపోతే దానిని సాధించాలంటే కఠోర శ్రమ అవసరం. దానికి సంబంధించిన శాఖ వారు నిర్వహించే పోటీ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా డబ్బులు కడితే ఉద్యోగం వస్తుందని చెప్పడంతో నిరుద్యోగులు నమ్మి మోసపోయారు.   ఓ రిటైర్డ్ ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేశాడు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీసులు అంటారు. అలాంటిది కంచె చేను మేస్తే కాపాడేవారెవ్వరు అన్నచందంగా మారింది ఓ పోలీస్ నిర్వాహకం. అమాయక నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ. కోట్లలో దండుకున్న వైనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని జగిత్యాల జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి అనే వ్యక్తి మోసం చేశాడని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రనికి చెందిన సాన అనిల్ కుమార్, కునబోయిన చంద్రశేఖర్, ఇద్దరు యువకులు వాపోయారు. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని దీంతో హెచ్ఆర్సీని ఆశ్రయించామని బాధితులు తెలిపారు.

    జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ..
    2016 జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అప్పటి ఎస్సై గుర్రం రాజమౌళి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ద్వారా వీరిని నమ్మించి.. తనకు రైల్వేశాఖలో తెలిసిన వారు ఉన్నారని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తానని వీరిని నమ్మబలికాడు. ఒక్కొక్కరి దగ్గర రూ. 13 లక్షలు అప్పనంగా తీసుకున్నాడు. ఇది నిజమే అనుకోని బాధితులు ఇంటి ని అమ్ముకొని డబ్బులు కట్టారు. వీటితో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. డబ్బులు తీసుకోని 5సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పుడు అప్పుడు అంటూ మాట దాటేస్తూ ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం రాక డబ్బులు రాక.. ఇబ్బంది పడుతున్నామన్నారు. చేసేది ఏమి లేక తాము ఇచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎస్ఐ ని కోరగా తను ఎస్సై నని ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు గురి చేశాడని మీడియా ముందు బాధితులు వాపోయ్యారు.

    అతనిపై చర్యలు తీసుకోవాలి..
    వీరేకాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి బాధితులు ఇంకా 16 మంది బాధితులు ఉన్నారని తెలిపారు. తాము రాతపూర్వకంగా స్థానిక ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో, మరియు ఉన్నత స్థాయి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా మాకు న్యాయం చేసి డబ్బులు తీసుకున్న ఎస్ఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు..
    Published by:Veera Babu
    First published:

    Tags: Cheating, Crime news, Retired si, Telangana, Un employement

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు