చెరువు పక్కన టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..

వెంకటరమణ కన్పించడం లేదని ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంటిలో వెంకటరమణ మృతదేహాన్ని గుర్తించారు.

news18-telugu
Updated: June 25, 2020, 7:50 AM IST
చెరువు పక్కన టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఊరి శివారులోని చెరువు ఘాట్ సమీపంలోని లోయలో టిఫిన్ బాక్సులో తలను పడేశారు. మొండెం మరోచోట పడింది. ఈ ఘటన కడప జిల్లా ఎర్రగుంట్లలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన విశ్రాంత ఉద్యోగి వెంకటరమణయ్య ఇతరులకు అప్పులు ఇస్తుంటాడు. మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్యకు రూ.50 లక్షల వరకు అప్పు ఇచ్చాడు. ఆ క్రమంలోనే ముసలయ్య విశ్రాంత ఉద్యోగి వెంకటరమణయ్యను హత్య చేసినట్టు తెలుస్తోంది. వెంకటరమణయ్యను అతి దారుణంగా మొండెం నుంచి తలను వేరు చేశారు. అనంతరం తలను తీసుకెళ్లి కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్‌లో తలను పడేశాడు. అయితే వెంకటరమణ కన్పించడం లేదని ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంటిలో వెంకటరమణ మృతదేహాన్ని గుర్తించారు. తల గురించి అడగ్గా తలను టిఫిన్ బాక్సులో పెట్టి లోయలో పడేసినట్టు ముసలయ్య చెప్పారని పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటరమణ ఎర్రగుంట్లలో భారీగా అప్పులు ఇచ్చారని, ముసలయ్య సైతం రూ.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వెంకటరమణ హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
First published: June 25, 2020, 6:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading