వరంగల్‌లో దారుణం... తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్ సీఐ అతని భార్య మృతి

తల్లి రమణమ్మ చనిపోవడంతో ఆమె అంత్యక్రియలకు వెళ్తూ... రిటైర్ట్ సీఐ అతని భార్య కూడా మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

news18-telugu
Updated: February 16, 2020, 8:51 AM IST
వరంగల్‌లో దారుణం... తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్ సీఐ అతని భార్య మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోట చేసుకుంది. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలోని క్రాస్ రోడ్స్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న రిటైర్డ్ సీఐ విజయ్ కుమార్ అతని భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న విజయ్ కుమార్ కూతురు మౌనిక, ఆయన డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఆదిలాాబద్ జిల్లాలో నివసిస్తున్న విజయ్ కుమార్ తల్లి రమణమ్మ చనిపోవడంతో ఆమె అంత్యక్రియలకు వెళ్తూ... రిటైర్ట్ సీఐ అతని భార్య కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు తల్లి అంత్యక్రియలు కూడా నిలిచిపోయాయి.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు