హోమ్ /వార్తలు /క్రైమ్ /

మృతదేహాన్ని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసిన గ్రామస్తులు.. చూస్తూ ఉండిపోయిన పోలీసులు.. అసలు ఎందుకు ఇలా చేశారంటే..?

మృతదేహాన్ని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసిన గ్రామస్తులు.. చూస్తూ ఉండిపోయిన పోలీసులు.. అసలు ఎందుకు ఇలా చేశారంటే..?

(Image-Twitter)

(Image-Twitter)

ఓ యువకుడి మృతదేహాన్ని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసిన గ్రామస్తులు.. మృతదేహాన్ని అటూ ఇటూ ఊపడం ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వారి చర్యను అడ్డుకోలేకపోయారు.

  ఓ యువకుడి మృతదేహాన్ని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసిన గ్రామస్తులు.. మృతదేహాన్ని అటూ ఇటూ ఊపడం ప్రారంభించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వారి చర్యను అడ్డుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అసలు గ్రామస్తులు మృతదేహాన్ని ఎందుకు అలా చేశారనేది చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుణ జిల్లాలోని కుంభ్‌రాజ్ పోలీస్ స్టేషన్(Kumbhraj Police Station) పరిధిలోని జోగీపురా గ్రామానికి చెందిన భన్వర్‌లాల్ బంజారా అనే వ్యక్తి నదిలో స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కొట్టుకుని పోయాడు. ఆ దృశ్యాలను చూసిన కొందరు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఈ విషయం తెలియజేశారు.

  దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. భన్వర్‌లాల్ బంజారా మృతదేహాన్ని గ్రామస్తుల సాయంతో వెలికితీశారు. అప్పటికే భన్వర్‌లాల్ మృతిచెందాడు. కొందరు గ్రామస్తులు.. భన్వర్‌లాల్ శరీరాన్ని తలకిందులుగా వేలాడదీసి నీరు బయటకు వచ్చేస్తే అతను బతికే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో మిగిలిన గ్రామస్తులు.. వారి మాటలు నమ్మి అలానే చేశారు. భన్వర్‌లాల్ మృతదేహాన్ని ఓ చెట్టుకు తలకిందులుగా తాడు సాయంతో వేలాడదీశారు. దాదాపు 30 నిమిషాల పాటు అటూ ఇటూ ఊపారు. అక్కడ కొందరు మహిళలు ఏడుస్తూ కనిపించారు.

  Sad: ఎంత పని చేశావ్ తల్లి.. ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి.. మీకు మొఖం చూపించలేను’అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకన్న యువతి..


  పోలీసులు కూడా అక్కడే ఉన్నప్పటికీ వారి చర్యను అడ్డుకోలేకపోయారు. భారీగా అక్కడికి చేరుకన్న జనాలు ఎలాంటి కోవిడ్(Covid-19) నిబంధనలు పాటించలేదు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను గాలికి వదిలేశారు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఇది కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.


  వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లి.. కుక్క పిల్లతో ఆడుకుంటున్న బాలిక.. అయ్యో పాపం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం..

  ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం అప్పగించారు. ‘భన్వర్‌లాల్ బతుకుతాడని చెప్పి అతని కుటుంబ సభ్యులు ఇలా చేశారు. నేను వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ వారు నా మాట వినిపించుకోలేదు. చెట్టుకు వేలాడదీసి అటూ ఇటూ ఊపారు.’సోనై పోలీస్ అవుట్ పోస్ట్ ఇంచార్జ్ తోరణ్ చెప్పారు. ఇక, కరోనా నిబంధనలు పాటించని గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ వీడియోలో పలువురుని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తోంది. వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు  పోలీసు శాఖ సిద్దమైంది. మరోవైపు ఆ వీడియోలో కొందరు పోలీసులు కూడా కనిపించడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉండి ఆ చర్యను ఎందుకు అడ్డుకోలేకపోయారని వారిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Madhya pradesh

  ఉత్తమ కథలు