రేణిగుంటలో పవన్ కళ్యాణ్‌కు ‌షాక్...దోపిడి దొంగల హల్‌చల్

పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయంలో జేబు దొంగలు చేతివాటం చూపించారు. జనసేన నేతల పర్సులు, మొబైల్ ఫోన్లు మాయం చేశారు.

news18-telugu
Updated: December 1, 2019, 3:33 PM IST
రేణిగుంటలో పవన్ కళ్యాణ్‌కు ‌షాక్...దోపిడి దొంగల హల్‌చల్
పవన్ కల్యాణ్ (Source: Twitter)
  • Share this:
రేణిగుంటలో పవన్ కళ్యాణ్‌కు ‌షాక్...దోపిిడి దొంగల హల్‌చల్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఆరు రోజులు పాటు నాలుగు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. అయితే సందట్లో సడేమియా అన్నట్లు కొందరు జేబు దొంగలు కూడా తమ చేతివాటం చూపించారు. సుమారు 40 మంది కార్యకర్తల జేబుల్లోంచి స్మార్ట్ ఫోన్లు, వాలెట్లు మాయం చేశారు. దీంతో వారంతా లబోదిబోమన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇదిలా ఉంటే రాయలసీమ పర్యటన సందర్భంగా పార్టీ బలోపేతంపై జనసేన నాయకులతో సమీక్షించడంతో పాటు వివిధ రంగాల్లోని రైతులు, నిపుణులతో సమావేశం అయ్యేందుకు పవన్ కళ్యాణ్ సన్నద్ధం అయ్యారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో ఉన్న సమస్యలు, లోపాలను స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తామని జనసేన నాయకులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని సమస్యలను ఎత్తిచూపి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన స్వరం వినిపించనున్నారు.


First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>