Home /News /crime /

REMAND PRISONER COMMITS SUICIDE IN SANGAREDDY JAIL ON VALENTINES DAY OVER HIS LOVE MARRIAGE TRAGEDY MKS

Sangareddy : వీళ్ల ప్రేమ కథ ఇలా ముగుస్తుందని ఊహించలేరు.. 14 పేజీల లేఖలో అంతులేని విషాదం..

స్వర్ణలత, భానుచందర్ పెళ్లినాటి ఫొటో

స్వర్ణలత, భానుచందర్ పెళ్లినాటి ఫొటో

‘ప్రేమ లేని లోకంలో ఉండలేను. నాకు భూమి, డబ్బు లేదంటూ తరచూ నా భార్య కుటుంబ సభ్యులు అనే మాటలు వింటే నరకంలో ఉన్నట్లు అనిపించేది. పిల్లల్ని కనడం చంపుకోవడానికి కాదనే విషయాన్ని పెద్దలు గుర్తెరగాలి..’ అంటూ రిమాండ్ ఖైదీ ఆత్మహత్య..

ప్రేమ లేని లోకంలో ఉండలేను.. నేను కూడా నా ప్రేయసి దగ్గరికి పోతున్నాను.. నా చావు తర్వాత ఎవరినీ ఇబ్బంది పెట్టకండి.. అంటూ 14 పేజీల లేఖరాసి మరీ ప్రాణాలు వదిలేశాడో ప్రేమికుడు. వాలంటైన్స్ డే రోజున సంగారెడ్డిలోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ భానుచందర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. సంగారెడ్డి జైలు అధికారులు, పోలీసులు, మృతుడి కుటుంబీకులు వెల్లడించిన వివరాలివి..

వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి గ్రామానికి చెందిన తేళ్ల భానుచందర్‌(24) డ్యాన్సర్‌. చిన్న చిన్న షోలు చేస్తూ, టీవీ డాన్స్ కార్యక్రమాల్లో అవకాశం కోసం ప్రయత్నించేవాడు. అదే గ్రామంలో అతని మేనమామ కుటుంబం కూడా నివసిస్తోంది. చందర్ తనకంటే రెండేళ్లు పెద్దదైన మేనమామ కుమార్తె స్వర్ణలతను ప్రేమించాడు. అదే విషయాన్ని పెద్దలకు తెలియపర్చగా, యువతి తరఫు వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇళ్లలో నుంచి వెళ్లిపోయిన బానుచందర్-సర్ణలత.. గతేడాది మార్చి 10న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా కుటుంబీకుల వేధింపులు ఆగలేదు. యువకుడికి ఆస్తి లేదన్న కారణంతో అమ్మాయి తరఫువాళ్లు ఆ పెళ్లిని అంగీకరించలేదు. బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లిపోయారు..

Zaheerabad: ప్రేమికుల రోజు ఏకాంతమంటూ దారుణం.. దిండ్లు పేర్చి నిద్రపోతున్నట్లు నమ్మించి!!


భానుచంద్ నుంచి విడదీసిన తర్వాత స్వర్ణలతను సనత్‌నగర్‌(హైదరాబాద్)లోని సోదరి ఇంట్లో ఉంచారు కుటుంబీకులు. పెళ్లయి నెలలు గడుస్తున్నా భర్తతో కలిసి జీవించే అవకాశంలేకపోవడం, పెద్దవాళ్లు అంగీకరిస్తారనే నమ్మకం సన్నగిల్లిన క్రమంలో స్వర్ణలత జనవరి 5న ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి భర్తే కారణమంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భానుచందర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతణ్ని జనవరి 24న సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి రిమాండ్‌ ఖైదీగా తరలించారు..

Shocking: సాంబార్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి.. బర్త్ డే వేడుకలో విషాదం.. కృష్ణా జిల్లాలో ఘటన..


ప్రేమ పెళ్లి విఫలం కావడం, ప్రేయసి బలవన్మరణానికి పాల్పడటం, ఆ కేసులో తాను జైలుపాలు కావడం భానుచందర్ ను కుంగదీశాయి. వాలంటైన్స్ డే అయిన సోమవారం ఉదయం 6 గంటల సమయంలో అతను జైలులోని స్నానాల గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దుప్పటితో వెంటిలేటర్‌ చువ్వలకు ఉరేసుకుని ఉసురుతీసుకున్నాడు. భార్య తరఫు వాళ్లే తమ కుమారుడి చావుకు కారణమయ్యారని భానుచందర్ కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. కాగా..

Surgical strike ఆధారాలివిగో : ఆర్మీని బద్నాం చేసిన CM KCR: అస్సాం సీఎం దిమ్మతిరిగే కౌంటర్ Video


చనిపోవడానికి ముందు భానుచందర్ 14 పేజీల లేఖ రాసినట్లు జైలు సిబ్బంది గుర్తించారు. ప్రేమ లేని లోకంలో.. ఉండలేక శోకంతోతన చావుకు ఎవరూ కారణం కాదని, ఎవర్నీ ఇబ్బంది పెట్టొద్దంటూ 14 పేజీల సూసైడ్‌ లేఖలో బాధితుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ‘నా భార్య చనిపోవడానికి ముందు కూడా నాతో వీడియోకాల్‌లో మాట్లాడింది. ఎప్పటికీ కలిసే ఉందామని కోరింది. కానీ అలా జరగలేదు.

CM KCR: కాంగ్రెస్‌తో పొత్తుపై కేసీఆర్ కుండబద్దలు -ఆ విషయంలో Rahul Gnadhiకి కడదాకా మద్దతు


ఆమె మరణానికి పరోక్షంగా కారణమయ్యాననే ఆవేదన నన్ను అనుక్షణం బాధిస్తోంది. నాకు భూమి, డబ్బు లేదంటూ తరచూ నా భార్య కుటుంబ సభ్యులు అనే మాటలు వింటే నరకంలో ఉన్నట్లు అనిపించేది. పిల్లల్ని కనడం చంపుకోవడానికి కాదనే విషయాన్ని పెద్దలు గుర్తెరగాలి. ఈ భూమిపై వాళ్లు సంతోషంగా ఉంటే చాలనుకోవాలి. అలా అనుకోని.. ప్రేమలేని లోకంలో ఉండలేక చనిపోతున్నా’అంటూ భానుచందర్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
Published by:Madhu Kota
First published:

Tags: Lovers suicide, Sangareddy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు