• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • REMAND PRISONER COMMITS SUICIDE IN NIZAMABAD DISTRICT BN

ఐదు నెలలుగా చెల్లిపై అత్యాచారం.. ఆస్పత్రిలో ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

ఐదు నెలలుగా చెల్లిపై అత్యాచారం.. ఆస్పత్రిలో ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

పోలీసులు పక్కా ప్రణాళికతో బాలాజీని పట్టుకున్నారు. అయితే అతడికి కోవిడ్ లక్షణాలు కన్పించడంతో వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

  • Share this:
    ఓ యువకుడు వావివరసలు మర్చిపోయాడు. మైనర్ బాలిక అయిన చిన్నమ్మ కూతురిపైనే కన్నేశాడు. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. గదిలో బంధించి దాదాపు ఐదు నెలల పాటు ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఎట్టకేలకు అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ అనుమానిత లక్షణాలు కన్పించడంతో ఆస్పత్రిలో చేరడం.. నెగిటివ్ రిపోర్డు రావడం చకచకా జరిగిపోయింది. అయితే గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ విచారణ తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీసులకు ఊహించని షాక్ ఎదురయ్యింది. సదరు యువకుడు ఆస్పత్రిలోని బాత్ రూమ్‌లో లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రిమాండులో ఉన్న ఖైదీ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది.

    ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని ఓ కాలనీలో బాలిక(12) నివసిస్తోంది. బాలిక పెద్దమ్మ కొడుకు అయిన నిర్మల్ జిల్లాకు చెందిన బాలాజీ పవర్ రాజ్(25) ఫిబ్రవరి నెలలో మాయ మాటలు చెప్పి మహారాష్ట్రలోని పూణేకు తీసుకెళ్లాడు. అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని అందులో బాలికను ఉంచాడు. దాదాపు ఐదు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆ బాలిక వారం రోజుల క్రితం పవర్ రాజ్ గదిలో లేని సమయంలో తప్పించుకుని బాన్సువాడకు చేరుకుంది.

    బాన్సువాడ పోలీసు స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పక్కా ప్రణాళికతో బాలాజీని పట్టుకున్నారు. అయితే అతడికి కోవిడ్ లక్షణాలు కన్పించడంతో వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాలాజీకి కోవిడ్ పరీక్షలు చేయగా బుధవారం రాత్రి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. పోలీసులు ఈ విషయమై ఎల్లారెడ్డిలోని న్యాయమూర్తికి సమాచారం చేరవేశారు. దీంతో న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

    దీంతో నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకునేందుకు గురువారం ఉదయం పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే వార్డుల్లో నిందితుడు కన్పించలేదు. పోలీసులు బాత్‌రూమ్‌లో పరిశీలించగా అప్పటికే బాలాజీ లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు