మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారం.. గర్భవతి కావడంతో వెలుగుచూసిన ఘటన

ఓ బాలికపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగుచూసింది.

news18-telugu
Updated: November 26, 2020, 2:30 PM IST
మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారం.. గర్భవతి కావడంతో వెలుగుచూసిన ఘటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్నారులపై జరిగే లైంగికదాడుల్లో నిందితులు 99 శాతం తెలిసినవారే. ఈ విషయం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)– 2019 రిపోర్టులో వెల్లడైంది. అయితే చిన్నారులపై జరిగే కొన్ని లైంగిక దాడులు వెలుగుచూడగా.. మరికొన్ని మాత్రం సమాజంలో ఏమనుకుంటారో అని మరుగును పడుతున్నాయి. తాజాగా ఓ బాలికపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన దారుణం మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కురవి మండలంలోని ఓ తండాకు చెందిన 13 ఏళ్ల బాలిక జిల్లాలోని ఓ పాఠశాలలో చదువుతోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఉండటంతో బాలిక ఇంటి వద్దే ఉంటుంది.

ఈ క్రమంలోనే బాలికకు వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఉన్నట్టుండి బాలిక కళ్లు తిరిగి పడిపోవడంతో తల్లిందండ్రులు ఆందోళన చెందారు. వెంటనే బాలికను మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీనిపై తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని వారికి తెలిపింది.

ఈ విషయం తెలుసుకున్న బాల రక్షాబంధన్ కో ఆర్ఢినేటర్ జ్యోతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పుట్ట కమలాకర్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. అనంతరం రక్షన కేంద్రానికి తరలించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి బాలల సంరక్షణ అధికారులు బుధవారం కురవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై జక్కుల శంకర్‌రావు తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: November 26, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading