Woman: భార్యను ఇంట్లో ఉంచి ఊరెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి ఊహించని పరిణామం..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: కొద్దిరోజుల క్రితం వేరే ఊరికి వెళ్లిన వ్యక్తి.. అతడి భార్యను ఇంట్లోనే ఉంచాడు. తన బంధువును ఆమెకు తోడుగా ఉంచాడు.

  • Share this:
    ఒక వ్యక్తిని నమ్మడానికి ముందు అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చెడు లక్షణాలు ఉన్న వ్యక్తిని నమ్మితే.. అతడి వల్ల పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. పుణెలోని ఓ వ్యక్తి తనకు సమీప బంధుమైన మరో వ్యక్తిని బాగా నమ్మాడు. అతడు కూడా నమ్మకంగానే ఉంటూ వచ్చాడు. కానీ అతడి నమ్మకం వెనుక భయంకరమైన కుట్ర ఉందనే విషయాన్ని బాధితుడు ఊహించలేకపోయాడు. అతడి కుట్రకు ఏకంగా తన భార్యను కోల్పోయాడు. ఈ దారుణ ఘటన పుణెలో చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం వేరే ఊరికి వెళ్లిన వ్యక్తి.. అతడి భార్యను ఇంట్లోనే ఉంచాడు. తన బంధువును ఆమెకు తోడుగా ఉంచాడు. జరగబోయే ప్రమాదాన్ని ఊహించకలేకపోయాడు. తన పని కోసం వేరే ఊరికి వెళ్లాడు. అయితే ఇలాంటి సమయం కోసమే చాలాకాలం ఎదురుచూస్తున్న అతడి బంధువు ఊహించని విధంగా కుట్ర చేశాడు.

    అతడి భార్యను తన మరో స్నేహితుడితో కలిసి గుడికి తీసుకెళ్లాడు. అతడిని గుడ్డిగా నమ్మిన యువతి... నిందితుడి కుట్రను ఊహించలేకపోయింది. ఇద్దరు కలిసి గుడి సమీపంలోని అడవిలోని యువతిని తీసుకెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి ప్రతిఘటించేందుకు ఎంతగానో ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. ఇద్దరు కలిసి ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం.. ఆమె చున్నీతోనే ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆ తరువాత యువతి శవాన్ని ఎవరూ గుర్తుపట్టుకుండా ఉండేందుకు ముఖాన్ని రాయితో చెక్కేశారు.

    Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..

    YS Jagan: ఏపీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. వారిచ్చే నివేదికలే సీఎం జగన్‌కు కీలకమా ?

    ఆ తరువాత ఊరి నుంచి తిరిగొచ్చిన భర్త.. తన భార్య ఆచూకీ ఇంట్లో ఉన్న బంధువును అడిగాడు. అయితే అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. ఆమె ఎక్కడికో వెళ్లిపోయిందని తెలిపాడు. ఒక రోజు తరువాత అతడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. తన స్టయిల్లో నిందితుడిని విచారించారు. నేరం ఒప్పుకున్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు నేరంలో పాలుపంచుకున్న మరో నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published: